How to get personal loan: పర్సనల్ లోన్ ఎలా పొందాలి! స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదిగో..
జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా ఆర్థిక అవసరాలు ఎదురవుతుంటాయి. పెళ్లిళ్లు, మెడికల్ ఎమర్జెన్సీలు లేదా ఇంటి మరమ్మతుల వంటి పనుల కోసం తక్షణమే నగదు కావాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో చాలామందికి గుర్తొచ్చే మొదటి మార్గం పర్సనల్ లోన్. అయితే, అసలు పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి? ఏయే డాక్యుమెంట్లు అవసరం? వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయాలపై అవగాహన ఉండటం చాలా ముఖ్యం. పర్సనల్ లోణ్ ఎలా పొందాలో (how to get personal loan) తెలియని వారు సింపుల్ గా ఈ స్టెప్స్ ఫాలో అయ్యి లోన్ పొందొచ్చు.

ముందుగా పర్సనల్ లోన్ పొందాలంటే బ్యాంకులు ప్రధానంగా మీ ఆదాయం, క్రెడిట్ హిస్టరీని గమనిస్తాయి. సాధారణంగా 21 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు, నెలకు స్థిరమైన ఆదాయం (జీతం లేదా వ్యాపారం) ఉన్నవారు దీనికి అర్హులు. ముఖ్యంగా మీ సిబిల్ (CIBIL) స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే, బ్యాంకులు మీకు తక్కువ వడ్డీ రేటుకే లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ ఆదాయంలో ఇప్పటికే ఉన్న ఇతర EMIలు పోగా, మిగిలిన మొత్తాన్ని బట్టి మీకు ఎంత లోన్ ఇవ్వాలో బ్యాంకులు నిర్ణయిస్తాయి.
అవసరమైన పత్రాలు (Required Documents)
పర్సనల్ లోన్ అప్లికేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి కావాలంటే ఈ క్రింది డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి..
- గుర్తింపు కార్డు: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి లేదా పాస్‌పోర్ట్.
- చిరునామా ధృవీకరణ: రేషన్ కార్డ్, కరెంట్ బిల్లు లేదా గ్యాస్ బిల్లు.
- గత 3 నుండి 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, జీతం స్లిప్పులు (Salary slips) , ఫారం-16.
- ఫోటోలు: పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.
అప్లై చేసే విధానం: స్టెప్ బై స్టెప్ గైడ్
పర్సనల్ లోన్ అప్లై చేయడం చాలా సులభం. మీరు నేరుగా బ్యాంకుకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- వడ్డీ రేట్లు చూసుకోండి: అన్ని బ్యాంకులు ఒకే రకమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేయవు. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీని ఇస్తే, మరికొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు తక్కువగా వసూలు చేస్తాయి. అందుకే ఆన్‌లైన్ వెబ్‌సైట్ల ద్వారా వివిధ బ్యాంకుల ఆఫర్లను పోల్చి చూసి. మీకు ఏది లాభదాయకమో నిర్ణయించుకోండి.
- ఎలిజిబిలిటీ చెక్: మీరు ఎంచుకున్న బ్యాంక్ వెబ్‌సైట్‌లో 'ఎలిజిబిలిటీ చెకర్' ఉంటుంది. అక్కడ మీ వయస్సు, నెలవారీ జీతం, నివసిస్తున్న నగరం వంటి వివరాలు ఇస్తే, మీకు ఎంత లోన్ వస్తుందో ముందే తెలుస్తుంది. మీ సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే లోన్ రావడం మరింత సులభం అవుతుంది.
- ఆన్‌లైన్ అప్లికేషన్: సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి 'Personal Loan' విభాగాన్ని ఎంచుకోండి. అక్కడ Apply for Personal Loan' పై క్లిక్ చేసి మీ వివరాలు నింపండి.
- వివరాల నమోదు: మీ పేరు, ఫోన్ నంబర్, ఆదాయం , అవసరమైన లోన్ మొత్తాన్ని నమోదు చేయండి.
- డాక్యుమెంట్ అప్‌లోడ్: అడిగిన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, గత 3 నెలల శాలరీ స్లిప్పులు, 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను బ్యాంకుకు సమర్పించాలి. ఆన్‌లైన్ అయితే వీటిని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- వెరిఫికేషన్: బ్యాంక్ ప్రతినిధులు మీ వివరాలను తనిఖీ చేసి, అంతా సరిగ్గా ఉంటే లోన్ ఆమోదిస్తారు. ఆమోదం పొందిన కొద్ది గంటల్లోనే నగదు మీ ఖాతాలోకి చేరుతుంది.
- నగదు జమ (Disbursement): లోన్ ఆమోదం పొందిన తర్వాత, బ్యాంక్ నుండి మీకు ఒక అగ్రిమెంట్ వస్తుంది. దానిపై సంతకం చేసిన కొద్ది గంటల్లోనే లేదా గరిష్టంగా 1-2 రోజుల్లో లోన్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
జాగ్రత్తలు తప్పనిసరి
పర్సనల్ లోన్ తీసుకోవడం సులభమే అయినా.. దానిని తిరిగి చెల్లించే సామర్థ్యం మీకు ఉందో లేదో ముందే ఆలోచించుకోవాలి. అనవసరమైన విలాసాల కోసం లోన్లు తీసుకోవడం మీ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీస్తుంది. తక్కువ వడ్డీ రేటు ఎక్కడ ఉందో చూసుకుని, హిడెన్ ఛార్జీలు (Processing fees) ఏమైనా ఉన్నాయేమో క్షుణ్ణంగా చదవండి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, పర్సనల్ లోన్ మీ కష్టకాలంలో గొప్ప ఆసరాగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications