పెళ్లిళ్ల సీజన్‌లో మంచి గిరాకీ.. ఈ బిజినెస్ మీ ఇంట్లోనే స్టార్ట్ చెయ్యొచ్చు..
చాల మంది ఉద్యోగం వదిలేసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనీ ప్లాన్ చేస్తుంటారు కానీ సీజనల్ బిజినెస్ చేయాలనుకునే వారు చాల తక్కువగా ఉంటారు. ఏ వ్యాపారానికైనా పెట్టుబడి అవసరం కానీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఖర్చులు లేకుండా ఇంటి దగ్గర చేసే వ్యాపారాలు కూడా ఉన్నాయి వాటిలో క్యాటరింగ్ బిజినెస్ ఒకటి. క్యాటరింగ్ బిజినెస్ వల్ల ఎక్కువ శ్రమ లేకుండా ఇంటి వద్దనే ఉండి డబ్బులు సంపాదించుకోచ్చు దీనికి ఎలాంటి ష్యురీటి లేదా పర్మిషన్ అవసరం లేదు. దీని పై వచ్చే లాభం కూడా మీ చేసే దాని పై ఆధారపడి ఉంటుంది.
క్యాటరింగ్ వ్యాపారానికి అన్ని రోజుల్లో డిమాండ్ ఉంటుంది, కానీ పెళ్లిళ్ల సీజన్‌లో కొంచెం డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ టైంలో వివాహాలు, పార్టీలు, వేడుకలు వీటితో పాటు పుట్టినరోజు ఫంక్షన్లలో కూడా క్యాటరింగ్‌కు డిమాండ్ ఉంటుంది. రానున్న రోజుల్లో మళ్ళీ పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. దింతో ఈ వ్యాపారానికి డిమాండ్ మళ్లీ పెరగవచ్చు. ఈ క్యాటరింగ్ బిజేనెస్ మీరు రూ.10,000తో స్టార్ట్ చేయవచ్చు. ఈ మొత్తం రేషన్, ప్యాకేజింగ్‌కు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కరోనా లాక్ డౌన్ తరువాత ప్రస్తుతం ప్రజలు శుభ్రతపై చాలా శ్రద్ధ చూపుతున్నారు. ఇందుకు మీరు క్యాటరింగ్ వ్యాపారంలో శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. క్యాటరింగ్ ద్వారా ఎవరైనా ఏదైనా పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలు, ఈవెంట్స్ లేదా ఏదైనా ఫంక్షన్స్ కి ఆర్డర్ చేసిన ఫుడ్ వండి సప్లయ్ చేయడం. ఇలా వండి సప్లయ్ చేసినందుకు మీకు డబ్బు చెల్లిస్తారు.

ముఖ్యంగా క్యాటరింగ్ ఆర్డర్స్ వంటగదిలో శుభ్రత పాటించాలి. క్యాటరింగ్ వ్యాపారం కోసం మీ దగ్గర పెద్ద పాత్రలు, గ్యాస్, సిలిండర్ మొదలైనవి తప్పనిసరి అవసరం. దీనితో పాటు మీకు పనిలో కొంత సహకరించే వారు కూడా అవసరం కావచ్చు. మీరు క్యాటరింగ్ వ్యాపారం చేస్తూ నెలకు రూ.25 నుంచి 50 వేలు సంపాదించవచ్చు కూడా.
కొన్ని నగరాల్లో క్యాటరింగ్ వ్యాపారం చేసే వాళ్ళు చాల మంది ఉంన్నారు. మీరు ఈ బిజినెస్ లో ముందు ఉండాలనుకుంటే మీరు మీ వ్యాపారాన్ని బాగా ప్రమోట్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు మీ ఫుడ్ క్వాలిటీ, సర్వీస్ అండ్ బడ్జెట్ రేట్ సెట్ చేయడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించవచ్చు. అయితే క్యాటరింగ్ తో పాటు క్యాటరింగ్ బాయ్స్ మీ దగ్గర ఉంటె ఇంకా ఎక్కువ మొత్తం సంపాదించొచ్చు.


Click it and Unblock the Notifications