Multibagger stock: ఐదేళ్లలో 354 శాతం రాబడి ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం రిస్క్ కూడుకున్నది. అయితే మంచి అవగాహన సరైన స్టాక్స్ ఎంచుకుంటే రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మల్టీ బ్యాగర్ స్టాక్ ల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెబుతున్నారు. ఇలాంటి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ లో సౌత్ వెస్ట్ పిన్నకిల్ ఎక్స్‌ప్లోరేషన్ ఒకటి. ఈ స్టాక్ షేర్ ధర మంగళవారం ఇంట్రా-డే ట్రేడింగ్‌లో దాదాపు 9 శాతం పెరిగింది. త్రైమాసిక ఫలితాలతో స్టాక్ లో పాజిటివిటి కనిపించింది. కంపెనీ ఏకీకృత ఆదాయం ఏడాది ప్రాతిపదికన 53 శాతం పెరిగి రూ.61.7 కోట్లకు చేరగా, పన్ను తర్వాత లాభం (PAT) 287 శాతం పెరిగి రూ.9.3 కోట్లకు చేరింది.
ఈ మల్టీబ్యాగర్ స్టాక్ మంగళవారం బీఎస్ఈలో 8.8 శాతం వరకు పెరిగి, ఒక్కో షేరుకు రూ.257.40 గరిష్ట స్థాయిని తాకింది. కాగా ఈ స్టాక్ గత వారంలో 12 శాతం, ఒక నెలలో 2 శాతం, మూడు నెలల్లో 3 శాతం, ఆరు నెలల్లో 38 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 68 శాతం రాబడి ఇవ్వగా.. గత ఐదేళ్లలో 354 శాతం లాభాన్ని ఇచ్చింది. సౌత్ వెస్ట్ పిన్నకిల్ ఎక్స్‌ప్లోరేషన్ 2026 మేలో రూ.287.95 వద్ద తన 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అక్టోబర్ 2025లో రూ.120.55 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది.

పన్ను తర్వాత లాభం (PAT) ఏడాది క్రితం ఉన్న రూ.2.4 కోట్ల నుంచి రూ.9.3 కోట్లకు పెరిగింది. అలాగే ప్యాట్ మార్జిన్ 6 శాతం నుంచి 15 శాతానికి చేరింది. PBT మార్జిన్ కూడా 8 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్లు కంపెనీ వివరించింది. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తాము బలమైన పనితీరును కనబరిచామని కంపెనీ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జైన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఆదాయంలో 53 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ త్రైమాసికంలో కంపెనీ రాజస్థాన్‌లో రూ.307 కోట్ల విలువైన తన అతిపెద్ద సింగిల్-సింప్లీ ఆర్డర్‌ను ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభించింది. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి రూ.166 కోట్లకు పైగా విలువైన కాంట్రాక్ట్ పొడిగించినట్లు తెలిపింది.
సౌత్ వెస్ట్ పిన్నకిల్ కంపెనీ కంపెనీ ప్రస్తుతం ఎనిమిది రాష్ట్రాలలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కార్యాచరణ అభివృద్ధిలలో భాగంగా కంపెనీ తన ఝార్ఖండ్ బొగ్గు బ్లాక్‌లో అన్వేషణ పనులను పూర్తి చేసింది. దీనికి సంబంధించిన జియోలాజికల్ రిపోర్ట్ (GR) ప్రస్తుతం తయారు చేస్తోంది. ఈ కంపెనీ ఒమన్‌లో తన రెండో జాయింట్ వెంచర్ కింద ఏరియల్ సర్వేను కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ తయారీలో ఉంది. ఖనిజ అన్వేషణపై ప్రభుత్వం దృష్టి సారించడం, విధాన సంస్కరణలు, కీలక ఖనిజాలలో స్వావలంబన సాధించడం వంటివి గణనీయమైన వృద్ధి అవకాశాలను సృష్టిస్తాయని కంపెనీ తెలిపింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications