For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వ్యాలెట్‌తో త్వరలో సినిమా టిక్కెట్ బుకింగ్, షాపింగ్ చేయవచ్చు

|

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ వ్యాలెట్లని ప్రోత్సహిస్తున్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం T Walletను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో అన్ని రకాల సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఉన్న సేవలతో పాటు రానున్న రోజుల్లో ఇతర సేవలను కూడా అందించే ఏర్పాట్లు చేస్తోంది.

IRCTC tatkal: తత్కాల్ బుకింగ్ రూల్స్, టైమింగ్స్, ఛార్జీలుIRCTC tatkal: తత్కాల్ బుకింగ్ రూల్స్, టైమింగ్స్, ఛార్జీలు

T Wallet త్వరలో ఈ కామర్స్ బిల్లింగ్

T Wallet త్వరలో ఈ కామర్స్ బిల్లింగ్

బుక్ మై షో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సైట్లలో చేసే షాపింగ్‌కు త్వరలో T Wallet యాప్ ద్వారా బిల్లు చెల్లించే వెసులుబాటును తీసుకురానున్నారు. దేశంలోనే ఈ తరహా అన్ని రకాల బిల్లులు చెల్లించే సౌకర్యం కల్పిస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. T Wallet రిజిస్ట్రేషన్ల సంఖ్య పది లక్షలకు చేరుకుంది. గత ఏడాది వరకు 4 లక్షల లోపు ట్రాన్సాక్షన్స్ జరిగేవి. ఇప్పుడు నెలకు 10 లక్షలకు పైగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఈ చెల్లింపులు చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ చెల్లింపులు చేసుకోవచ్చు.

T Wallet ద్వారా ప్రస్తుతం ట్రాఫిక్ ఛలాన్, ఆర్టీసీ బస్ టిక్కెట్లు, TSపీఎస్సీ నోటిఫికేషన్ చెల్లింపులు, టాస్క్ రిజిస్ట్రేషన్, దోస్త్ రిజిస్ట్రేషన్ అండ్ కన్ఫర్మేషన్ ఫఈజు, జెఎన్టీయూహెచ్ సేవలు, కార్మిక శాఖ నుంచి కొత్త షాప్స్ రిజిస్ట్రేషన్స్, విజయ డెయిరీ వెండర్ పేమెంట్స్, ఐజీఆర్ఎస్ ద్వారా టీ చిప్స్ వంటి పేమెంట్స్ చేయవచ్చు.

ఈ బిల్లులూ చెల్లించవచ్చు

ఈ బిల్లులూ చెల్లించవచ్చు

మొబైల్ రీచార్జ్, DTH రీఛార్జ్, ఇంటర్నెట్, మొబైల్, ల్యాండ్ ఫోన్ బిల్లు చెల్లింపులు, ప్రయివేటు బస్ టిక్కెట్, విమాన టిక్కెట్, హోటల్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఎంసెట్ పోటీ పరీక్షల ఫీజుల చెల్లింపుకు కూడా అనుసంధానించనున్నారు.

వర్చువల్ కార్డులతో త్వరలో షాపింగ్

వర్చువల్ కార్డులతో త్వరలో షాపింగ్

T Wallet ఉంటే డెబిట్ కార్డు తరహాలో వర్చువల్ రుపే కార్డులు జారీ చేస్తారు. ఈ కార్డుల ద్వారా త్వరలో బుక్ మై షో, ఫ్లిప్‌కార్ట్, ఐఆర్‌సీటీసీ, అమెజాన్, స్విగ్గీ, జొమాటో వంటి ఈ కామర్స్ వెబ్ సైట్లలో షాపింగ్ లేదా బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.

T Wallet ద్వారా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు

T Wallet ద్వారా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు

- మీసేవ కేంద్రాల ద్వారా T Walletను ఉపయోగించి నగదు తీసుకోవచ్చు.

- రేషన్ షాపులలో T Wallet ద్వారా బిల్లులు చెల్లించవచ్చు.

- విద్యార్థులు స్కాలర్‌షిప్ మొత్తాన్ని T Wallet జమ చేసుకునేందుకు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది ఫలితాలు ఇస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన T Wallet యాప్‌కు ఆర్బీఐ ప్రత్యేక అనుమతి ఇచ్చింది.

ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు

ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు

T Wallet ద్వారా రిజిస్ట్రేషన్లు, నగదు జమ, పేమెంట్లు చేయవచ్చు. అలాగే టీ వ్యాలెట్ నుంచి బ్యాంకు అకౌంటుకు, ఇతర వ్యాలెట్లకు అకౌంట్ ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు. నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.

English summary

ఈ వ్యాలెట్‌తో త్వరలో సినిమా టిక్కెట్ బుకింగ్, షాపింగ్ చేయవచ్చు | Soon you can pay E commerce bills from T Wallet

Using T Wallet, one can do Money Transfer, Mobile Recharge, Metro Card Recharge, Electricity Bill Payment, Water Bill Payment, Property Tax Payment.
Story first published: Monday, January 20, 2020, 13:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X