కొందరు నచ్చిన ఉద్యోగం చేస్తూ సక్సెస్ అయితే మరికొందరు మంచి ఉద్యోగాలను కూడా వొదిలేసి డ్రీమ్ బిజినిస్ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ అవుతున్నారు. ఏది ఏమైనా మనం కన్న కళలను నెరవేర్చుకోవడంలో ఎంతో సంతోషం ఉంటుంది. అయితే ఇలాంటి ఒక సక్సెస్ స్టోరీ చాల ఇన్స్పైర్ చేస్తుంది. నవనూర్ కౌర్ అనే మహిళా బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారంలో సక్సెస్ సాధించింది. ఐఎంటీ ఘజియాబాద్‌లో ఎంబీఏ చేసిన తర్వాత బ్యాంకులో మంచి ఉద్యోగం వచ్చింది.
కానీ, తన కలను నెరవేర్చుకోవడానికి ఆఖరికి తన కుటుంబం ఇష్టానికి వ్యతిరేకంగా ఉద్యోగాన్ని కూడా వోలిలేసి నవనూర్ కౌర్ ఒక తన సొంత స్టార్టప్‌ని ప్రారంభించింది. అదే 'జాగర్‌కెన్' పేరుతో ఆమె ప్రారంభించిన స్టార్టప్ ఇప్పుడు 22 జిల్లాలకు విస్తరించింది. ప్రస్తుతం ఆమె ఏటా రూ.2 కోట్లు సంపాదిస్తోంది. ఆమె తన కృషి, అంకితభావంతో ఇవన్నీ సాధించింది. అయితే నవ్నూర్ కౌర్ సక్సెస్ ప్రయాణం ఎలా మొదలైందంటే..?

లూథియానాలో పెరిగిన నవ్‌నూర్ కౌర్‌కు తండ్రి ప్రొఫెసర్, తల్లి స్కూల్ ప్రిన్సిపాల్. చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండే నవనూర్ కౌర్ 2019లో IMT ఘజియాబాద్‌లో MBA పూర్తి చేసింది. దీని తర్వాత గుర్గావ్‌లోని కోటక్ బ్యాంక్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. మంచి జీతం ఉన్నప్పటికీ కూడా ఆమె ఫుడ్ బిజినిస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎప్పుడూ ఉండేది. కుటుంబంలో చాలా మందికి మధుమేహం(షుగర్) ఉండటంతో బెల్లం అమ్మాలనే ఆలోచన వచ్చింది. రిఫైన్డ్ చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనాలని ఆమె అనుకుంది. ఏ పెద్ద కంపెనీ కూడా రసాయనాలు లేని బెల్లంను మార్కెట్‌లో విక్రయించడం లేదని గమనించింది.
నవ్‌నూర్ కౌర్ తన సేవింగ్స్ డబ్బుతో 'జాగర్‌కెన్' ప్రారంభించింది. రోజంతా ఆఫీసులో పనిచేసిన తర్వాత రాత్రిపూట తన స్టార్టప్‌లో పని చేసేది. నవ్‌నూర్ కౌర్ ఉద్యోగం వదిలేయడం ఆమె కుటుంబానికి ఇష్టం లేదు. కానీ, నవనూర్ కౌర్ తన ఆలోచనతో ఇంట్లో ఒప్పించింది. మొదట్లో డోర్ టూ డోర్ మార్కెటింగ్ కూడా చేసింది. తరువాత మెల్లిమెల్లిగా ప్రజలు ఆమె బెల్లం ఉత్పత్తులను ఇష్టపడటం మొదలు పెట్టారు తరువాత నమ్మకం పెరిగింది.
బెల్లంతో ప్రయోగాలు చేస్తూనే, నవనూర్ కౌర్ ఎన్నో కొత్త ఉత్పత్తులను సృష్టించింది. తన తండ్రి దగ్గర విద్యార్థి అయిన కౌశల్ పంజాబ్‌లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను నడుపుతున్నాడు. దింతో ఇద్దరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. కౌశల్ తయారీ పనులు చూస్తుండగా, నవనీత్ బ్రాండింగ్, కార్యకలాపాలు ఇంకా టై-అప్‌లు చేస్తుండేది. ఉద్యోగం చేసి సేవింగ్స్ చేసిన రూ.5 లక్షలను నవ్‌నూర్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు.
మార్గం సులభం కాదు. తక్కువ మార్జిన్లు, తక్కువ షెల్ఫ్-లైఫ్ కారణంగా చాలా మంది దుకాణదారులు ఆమె ఉత్పత్తులను స్టాక్ చేయడానికి నిరాకరించారు. కానీ, నవనూర్ కౌర్ వదల్లేదు. కౌశల్ బెల్లం షెల్ఫ్ జీవితాన్ని 1 నెల నుండి 9 నెలలకు పెంచాడు. ఇప్పుడు ఆమె ఉత్పత్తులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. అయితే జాగర్‌కెన్ లో 25 మంది ఉద్యోగులు ఉండగా వీరిలో 7-8 మంది మహిళలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమె స్టార్టప్ ఏటా రూ.2 కోట్లు సంపాదిస్తోంది. ఉద్యోగం వదిలేసి సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి నవనూర్ కౌర్ స్టోరీ చాలా స్ఫూర్తిదాయకం. అతని కృషి, అంకితభావం ఆమెని విజయాల శిఖరాలకు తీసుకెళ్లాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications