For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Credit Card limit: క్రెడిట్, డెబిట్ కార్డు లిమిట్ పరిమితి ఇలా సెట్ చేయండి

|

ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డ్స్ వినియోగం భారీగా పెరిగింది. నోట్ల రద్దు, ఇటీవలి కరోనా అనంతరం డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. ఇందులో భాగంగా డెబిట్, క్రెడిట్ కార్డ్స్ వినియోగం పెరిగింది. క్రెడిట్ కార్డ్స్‌ను ఉపయోగించి పరిమితికి మించి ఖర్చు చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ ఖర్చులను అదుపులో పెట్టడానికి మీ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ట్రాన్సాక్షన్స్ పైన పరిమితిని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు.

అంటే మీరు కార్డును ఉపయోగించిన ప్రతిసారి రూ.5వేలు లేదా రూ.10వేలకు మించి ట్రాన్సాక్షన్స్ చేయకూడదనుకుంటే దానికి తగినట్లుగా పరిమితిని ఏర్పాటు చేయవచ్చు. అయితే అంతకుమించి చేసే ట్రాన్సాక్షన్స్ విఫలమవుతాయి. అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్‌ను కూడా నియంత్రించే అవకాశముంది.

ఇలా సెట్ చేసుకోవాలి

ఇలా సెట్ చేసుకోవాలి

క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ప‌రిమితిని ఏర్పరుడుకునే విధానం బ్యాంకు నుండి బ్యాంకుకు మారుతుంది. కొన్ని బ్యాంకులు కార్డు పైన ఉన్న బ‌ట‌న్‌ను స్విచ్ ఆన్ చేయ‌డం ద్వారా అనుమ‌తిస్తే, చాలా బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా లిమిట్‌ను సెట్ చేసుకునే సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నాయి. మీరు కార్డ్ ఆప్ష‌న్‌కు వెళ్లి ప‌రిమితి విధించాల‌నుకుంటున్న కార్డు వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.

దేశీయ ట్రాన్సాక్షన్స్ కోసం లేదా అంత‌ర్జాతీయ ట్రాన్సాక్షన్స్ కోసం ప‌రిమితి ఏర్పాటు చేయాల‌నుకుంటున్నారా లేదా ఇత‌ర మార్పులు ఏమైనా చేయాల‌నుకుంటున్నారా అనే ఆప్షన్స్ అందుబాటులోకి వస్తాయి. ఇందులో మీకు కావ‌ల‌సిన ఆప్ష‌న్‌ను ఎంచుకొని, పరిమితిని సెట్ చేసుకోవ‌చ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా లిమిట్‌ను సెట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి కొన్ని బ్యాంకులు.

పరిమితి మించితే సమాచారం

పరిమితి మించితే సమాచారం

ఒకసారి పరిమితిని సెట్ చేసుకునే ఆప్ష‌న్‌ను ఎనేబుల్ చేస్తే ఆ త‌ర్వాత బ్యాంకు పరిమితి విధించిన విషయాన్ని మీకు తెలియజేస్తుంది. త‌దుప‌రి ట్రాన్సాక్షన్ ప‌రిమితికి మించితే బ్యాంకు మీకు సమాచారాన్ని అందిస్తుంది. డెబిట్, క్రెడి్ కార్డ్స్ మోసాలు పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇలాంటి మోసాల్ని అరికట్టేందుకు బ్యాంకులతో పాటు మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి మీ పాస్ వర్డ్, పిన్ వంటి వివరాలను ఎవరితోను షేర్ చేయవద్దు. మీ కార్డు ఉపసంహరణ పరిమితిని ఎంచుకోవాలి.

ఈ సమస్యలు రావు

ఈ సమస్యలు రావు

క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలను అరికట్టడానికి బ్యాంకులతో పాటు మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే మీ పిన్, పాస్ వర్డ్ ఎవరితోను షేర్ చేసుకోవద్దు. మీ డెబిట్ కార్డు ఉపసంహరణ పరిమితి రూ.10వేలు సెట్ చేసుకుంటే, ఏదైనా మోసం జరిగినా రూ.10వేలకు మించకుండా ఉంటుంది. అంతేకాదు, మరిన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. క్రెడిట్ కార్డు పరిమితి లేకుంటే ఇష్టారీతిన ఖర్చు చేస్తాం. పరిమితి ఉంటే ఆచితూచి ఖర్చు చేస్తాం.

English summary

Credit Card limit: క్రెడిట్, డెబిట్ కార్డు లిమిట్ పరిమితి ఇలా సెట్ చేయండి | Set your own credit and debit card limits

Know your limits might be some of the best credit card advice ever given — but not for the reasons you’d think.
Story first published: Sunday, August 29, 2021, 12:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X