DigiLocker: ప్రస్తుత కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త అద్భుతం చోటుచేసుకుంది. అదే రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో భాగస్వాములుగా మారటం. చాలా కాలంగా విదేశీ ఇన్వెస్టర్ల తీరుతో అస్థిరతలను చూసిన మార్కెట్లలో రిటైల్ పెట్టుబడిదారుల పార్టిసిపేషన్ కొత్త బలాన్ని నింపిన సంగతి తెలిసిందే. దీనిపై ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించటం మనం చూశాం.
దీంతో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో చాలా మంది కొత్త పెట్టుబడిదారులు ప్రతిరోజూ వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈక్విటీ మార్కెట్‌లో క్లెయిమ్ చేయని ఆస్తులను తగ్గించేందుకు ప్రభుత్వ డిజిలాకర్ వ్యవస్థను ఉపయోగించాలని మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ యోచిస్తోంది. దీనిని ఉపయోగించటం వల్ల పెట్టుబడిదారుడి మరణం తర్వాత ఫండ్ హౌస్, డిపాజిటరీల వద్ద మిగిలిపోయిన మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, స్టాక్‌లను తగ్గించవచ్చని సెబీ భావిస్తోంది. అందువల్ల ఫండ్ హౌస్‌లు, డిపాజిటరీలు.. డిజిలాకర్‌లో డిమ్యాట్, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ స్టేట్‌మెంట్‌లను అందుబాటులో ఉంచాలని రెగ్యులేటర్ సెబీ ప్రతిపాదించింది.

దీనికి తోడు కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్ మరణిస్తే సదరు డేటాను DigiLockerతో పంచుకోవాలని సూచించింది. ఇలా చేయటం వల్ల అసలు ఇన్వెస్టర్లు మరణించిన క్రమంలో వారి చట్టపరమైన వారసులకు వాటిని బదిలీ చేసే ప్రక్రియ సులభతరంగా మారుతుందని సెబీ పేర్కొంది. ఈ అంశంపై ముసాయిదా సర్క్యులర్‌ను విడుదల చేసి డిసెంబర్ 31, 2024 వరకు ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది. ఇన్వెస్టర్లకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ డేటాతో పాటు డీమ్యాట్ హోల్డింగ్ వివరాలు డిజిలాకర్ ఖాతాలో ఏకీకృతం చేయటం ద్వారా భారతదేశంలోని వ్యక్తులకు సంబంధించిన అన్ని ఫైనాన్షియల్ హోల్డింగ్‌లను ఒకే చేట అందుబాటులో ఉంచటానికి వీలుంటుందని సెబీ డ్రాఫ్ట్ సర్క్యులర్ పేర్కొంది.
డిజిలాకర్ అంటే ఏంటి?
డిజిలాకర్ అనేది ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ డాక్యుమెంట్ల సేకరణ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రస్తుతం ఒకే డిజిటల్ యాప్‌లో ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్‍తో పాటు అనేక ఇతర పత్రాలను కలిగి ఉంది. అలాగే డిసెంబర్ 2020లో డిజిలాకర్ ప్లాట్‌ఫారమ్‌లో బ్యాంక్ ఖాతాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, కొత్త పెన్షన్ పథకాల వివరాలను ఏకీకృతం చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం డిజిలాకర్ తన యూజర్లకు వ్యక్తులను నామినీలుగా చేర్చేందుకు అవకాశాన్ని కూడా కల్పించింది. డిజిలాకర్ యూజర్ మరణించినప్పుడు డిజిలాకర్ సిస్టమ్ డిజిలాకర్‌లో సృష్టించబడిన నామినీకి ఆ వివరాలు ఎస్ఎమ్ఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ఆటోమెటిక్‌గా తెలియజేయబడతాయి. సెబీ తీసుకొస్తున్న కొత్త విధానం ద్వారా డిజిలాకర్ పెట్టుబడిదారుడు మరణించినప్పుడు ఆ వివరాలు సకాలంలో నామినీకి అందించబడటం వల్ల ఆర్థిక ఆస్తుల బదిలీ ప్రక్రియను నామినీ ప్రారంభించటానికి వీలు కల్పించబడనుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications