గోల్డ్ ఎక్స్చేంజీకి సెబి పచ్చజెండా, ఈ నిబంధనలు తెలుసుకోండి

సెబీ బోర్డు మంగళవారం గోల్డ్ ఎక్స్చేంజ్ బోర్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇందులో బంగారం ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ రూపంలో వర్తకం చేయబడుతుంది. అలాగే, పారదర్శక డొమెస్టిక్ స్పాట్ ప్రైస్‌ను కలిగి ఉండటానికి దోహదపడుతుంది. బంగారాన్ని సూచించే పరిరకాలను ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ అని పిలుస్తారు. సెక్యూరిటీస్‌గా నోటిఫై చేస్తారని బోర్డు మీటింగ్ అనంతరం సెబి చైర్మన్ అజయ్ త్యాగి పేర్కొన్నారు. ఇతర సెక్యూరిటీస్ మాదిరిగానే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ ఫీచర్స్‌ను ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్(EGRs) కలిగి ఉంటాయన్నారు.

ఏదైనా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజ్, కొత్తది లేదా ఇప్పటికే ఉన్నది EGRలలో ట్రేడింగ్‌ను ప్రత్యేక విభాగంలో ప్రారంభించవచ్చును. EGR ట్రేడింగ్, EGRని బంగారంగా మార్చడానికి డినామినేషన్ సెబి ఆమోదంతో స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా నిర్ణయించబడుతుంది.

ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్

ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్

బంగారానికి ప్రాతినిథ్యం వహించే EGRs, బాండ్స్ షేర్ల తరహా సెక్యూరిటీలుగా నోటిఫై చేస్తామన్నారు. ఇతర సెక్యూరిటీల్లాగే EGRs ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ ఫీచర్స్‌ను కలిగి ఉంటాయి. EGR ట్రేడింగ్, బంగారం ఫిజికల్ డెలివరీని కలిగి ఉంటుంది గోల్డ్ ఎక్స్చేంజ్. ఇది భారత దేశంలో ఒక శక్తిమంతమైన గోల్డ్ ఎకోసిస్టంను సృష్టిస్తుందని సెబి అభిప్రాయపడింది. రెగ్యులేటర్ ప్రకారం ఈజీఆర్ కొనుగోలుకు, అమ్మకానికి ఎక్స్చేంజ్ ఒక జాతీయ ప్లాట్‌ఫాంగా ఉంటుంది. ప్రామాణికతను కలిగి ఉంటుంది.

బంగారం ధరలకు సంబంధించి నేషనల్ ప్రైసింగ్ స్ట్రక్చర్‌ను క్రియేట్ చేస్తుంది. గోల్డ్ ఎక్స్చేంజ్ చైన్‌లో పాల్గొనేవారికి సమర్థవంతమైన, పారదర్శకత కలిగిన ధరల ఆవిష్కరణ, పెట్టుబడి ద్రవ్యత, బంగారం నాణ్యతలో హామీ మొదలైన మొత్తం బంగారం మార్కెట్ సిస్టంకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని భావిస్తున్నట్లు సెబి పేర్కొంది.

ఇలా చేస్తాయి...

ఇలా చేస్తాయి...

- ట్రేడింగ్ కోసం EGRs విభజన, EGRsను బంగారంగా మార్చడం వంటి నిర్ణయాలను సెబీ అనుమతితో ఎక్స్చేంజ్‌లు తీసుకుంటాయి.

- గోల్డ్ ఎక్స్చేంజీలు నిర్వహించే EGRs ట్రేడింగ్, ఫిజికల్ గోల్డ్ డెలివరీ వంటి ప్రక్రియలతో దేశంలో పసిడికి జాతీయ మార్కెట్ ధర నిర్ణయం కానుంది.

- EGRs అమ్మకాలు, కొనుగోళ్ల కారణంగా సమర్థవంతమైన, పారదర్శకమైన ధరను కనుగొనేందుకు వీలు ఉంటుంది.

- బంగారం పెట్టుబడుల్లో ద్రవ్యత, పుత్తడి నాణ్యతపై హామీ వంటివి ఇన్వెస్టర్లకు లభిస్తాయి.

- ఎక్స్చేంజీల్లో జరిగే EGRs ట్రేడింగ్స్‌ను క్లియరింగ్ కార్పొరేషన్ సెటిల్ చేస్తుంది. EGRs, నిధులను కొనుగోలు, అమ్మకందారులకు పరస్పరం బదిలీ చేస్తుంది.

- EGRsను ఎంతకాలమైనా అట్టిపెట్టుకోవచ్చు. వీటిని సరెండర్ చేసి, అందుకు సమానమైన బంగారాన్ని వాల్ట్ మేనేజర్స్ నుండి పొందవచ్చు.

- భారత్‌లో రిజిస్టరైన సంస్థనే వాల్ట్ మేనేజర్‌గా వ్యవహరించేందుకు అనుమతిస్తారు. ఆ సంస్థ కనీసం రూ.50 కోట్ల నికర వ్యాల్యూతో ఉండాలి.

- EGRsను సృష్టించేందుకు అవసరమైన పసిడిని ఎక్స్చేంజీలు వాల్ట్ మేనేజర్ వద్ద డిపాజిట్‌ చేస్తాయి. వాల్ట్ నిర్వహణ సంస్థల్ని సెబీ నియంత్రిస్తుంది.

- పసిడిని డిపాజిట్ చేసుకోవడం, స్టోర్ చేయడం, భద్రపర్చడంతో పాటు EGR ఉపసంహరణ వివాదాల పరిష్కారం, వాల్ట్‌లోని పసిడిని డిపాజిటరీ రికార్డులతో సరిచూసుకోవడం వాల్ట్ మేనేజర్‌ బాధ్యతలు.

సోషల్ స్టాక్ ఎక్స్చేంజీ

సోషల్ స్టాక్ ఎక్స్చేంజీ

ఇదిలా ఉండగా, సోషల్ స్టాక్ ఎక్స్ంజీ ఏర్పాటుకు కూడా నిబంధనలు రూపొందించాలని సెబి బోర్డు నిర్ణయించింది. సామాజిక సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు, ఎన్జీవోల నిధుల సమీకరణ కోసం ఈ ఎక్స్చేంజీని ఉద్దేశించారు. సోషల్ స్టాక్ ఎక్స్చేంజీ ఏర్పాటుపై ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వంతో కలిశాక నిర్ణయం ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+