యోనో యాప్ ఆధారంగా పనిచేసే టైటాన్ పేమెంట్ వాచీలని ఆవిష్కరించాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), టైటాన్. డెబిట్ కార్డ్ స్వైపింగ్ అవసరం లేకుండా పాయింట్ ఆఫ్ సేల్(PoS)లపై వాచీని ఉంచి చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ఈ మేరకు ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఈ సౌలభ్యం పొందాలంటే యోనో యాప్‌లో నమోదయి ఉండాలి. ప్రస్తుతం యోనో యాప్‌ను 2.6 కోట్లమంది నమోదిత వినియోగదారులు ఉన్నారు. పిన్ నెంబర్ టైప్ చేయకుండానే రూ.2,000 వరకు చెల్లింపులు జరపవచ్చు.

యోనో యాప్ టైటాన్ వాచ్.. సరికొత్త అనుభూతి
SBIకి చెందిన యోనో యాప్‌తో అనుసంధానమైన టైటాన్‌పే వాచీ మార్కెట్లోకి రావడంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, టైటాన్ ఎండీ వెంకటరామన్‌లు ఈ వాచీని వర్చువల్‌గా విడుదల చేసారు. ఈ వాచీతో ఎస్బీఐ కస్టమర్లు పీవోఎస్‌ల వద్ద డెబిట్ కార్డు స్వేప్ చేయాల్సిన అవసరంలేదు. చేతికి ఉన్న యోనో ఆధారిత టైటాన్ వాచీతో కస్టమర్లు సరికొత్త షాపింగ్ అనుభూతిని పొందుతారు. రోజురోజుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఇది ఎంతో ప్రయోజనకరమని చెబుతున్నారు.

ఇది ఎలా పని చేస్తుంది?
- కస్టమర్లు యోనోలో రిజిస్టర్ కావాలి.
- వాచ్ స్క్రాప్‌లో అమర్చిన, టాపీ టెక్నాలజీస్ సంస్థ అభివృద్ధి చేసిన సురక్షిత ఎన్ఎఫ్‌సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) చిప్ సహాయంతో కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుంది.
- రూ.2,000 వరకు చెల్లింపులు జరపవచ్చు.
- పీవోఎస్ మిషన్లు అందుబాటులో ఉన్న ప్రతిచోట టైటాన్ పే పని చేస్తుంది.
- ఈ ఫీచర్ యాక్టివేషన్ కోసం యూజర్లు తమ ఎస్బీఐ ఖాతాతో కేవైసీ వెరిఫై చేయాల్సి ఉంటుంది.
- ఎస్బీఐ యోనో యాప్ ద్వారా టైటాన్ పే యాక్టివేట్ అవుతుంది.

వాచీ ధర, ఇతర వివరాలు
- ఈ వాచీ ధర రూ.2,995 నుండి రూ.5,995 మధ్య ఉంది.
- ఐదు వాచ్ మోడల్స్‌లలో మూడు పురుషుల కోసం, రెండు మహిళల కోసం డిజైన్ చేసింది టైటాన్.
- పురుషుల వాచీల ధరలు రూ.2,995, రూ.3995, రూ.5995గా ఉంది.
- స్త్రీల వాచీలు రూ.3,895, రూ.4,395గా ఉన్నాయి.
- రౌండ్ డయల్ డిజైన్‌తో నలుపు, గోదుమ రంగు స్ట్రాప్‌లతో ఈ వాచీలు లభిస్తాయి.


Click it and Unblock the Notifications