45 ని.ల్లోనే... అదిరిపోయే SBI ఎమర్జెన్సీ లోన్ స్కీం: EMI అప్పుడే చెల్లించొద్దు!
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం లాక్ డౌన్ కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎమర్జెన్సీ లోన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. చాలామందికి వ్యాపారాలు లేక, ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్ అనుకూల ఆప్షన్స్‌తో అత్యవసర లోన్లు ఇస్తోంది.

45 ని.ల్లో.. రూ.5 లక్షలు... 6 నెలల తర్వాత ఈఎంఐ
ఎమర్జెన్సీ లోన్ సౌకర్యం కింద ఎస్బీఐ రూ.5 లక్షల వరకు రుణం ఇస్తుంది. ఈ రుణాన్ని కేవలం 45 నిమిషాలలో పొందవచ్చు. ఈ మేరకు ఎస్బీఐ తన యోనో యాప్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ రుణాలు 10.5 శాతం వడ్డీతో లభిస్తాయి. ఈ అత్యవసర రుణాలు తీసుకున్నాక మరో వెసులుబాటు కూడా ఉంది. రుణానికి సంబంధించి ఈఎంఐ ఆరు నెలల తర్వాత ప్రారంభమవుతుంది.

మీకు అర్హత ఉందా ఇలా చెక్ చేసుకోండి
రుణాలు ఇప్పుడు తీసుకున్నప్పటికీ ఆరు నెలల తర్వాత నుండి ఈఎంఐ చెల్లంచవచ్చునని, అప్పటికి కరోనా, లాక్ డౌన్ ప్రభావం ముగిసి కొంత లోన్ చెల్లించే వెసులుబాటు లభిస్తుందని ఎస్బీఐ పేర్కొంది. రూ.5 లక్షల లోన్ తీసుకోవడానికి మీకు అర్హత ఉందా లేదా తెలుసుకోవాలంటే 567676కు ఎస్సెమ్మెస్ పంపించాలి. మీ అకౌంట్ నెంబర్‌లోని చివరి నాలుగు అంకెలు పై నెంబర్‌కు పంపించాలి. PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఖాతా నెంబర్ చివరి 4 అంకెలు టైప్ చేసి 567676కు పంపించాలి.

ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు
ఈ ఎమర్జెన్సీ లోన్ కోసం ఎవరు కూడా బ్యాంకులకు వెళ్లనవసరం లేదు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దీన్ని పూర్తి చేయవచ్చు. ఎప్పుడైనాసరే (24X7) మీరు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు. అన్ని వివరాల కోసం ఎస్బీఐ వెబ్ సైట్‌ను సందర్శించాలి.

ఇలా దరఖాస్తు చేయాలి
యోనో యాప్ లేకుంటే డౌన్ లోడ్ చేసుకోవాలి. Pre approved Loan పైన క్లిక్ చేయాలి.
- మీరు కాలపరిమితి, లోన్ అమౌంట్‌ను ఎంచుకోవాలి.
- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. దీనిని సబ్ మిట్ చేయాలి.
- ఆ తర్వాత మీ అకౌంట్లో లోన్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది.
- ఈ ప్రక్రియ 45 నిమిషాల్లో పూర్తవుతుంది.


Click it and Unblock the Notifications