SBI గుడ్‌న్యూస్: ఫోన్ చేస్తే ఇంటికే డబ్బులు, ఇవి తెలుసుకోండి.కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో దేశమంతా స్తంభించిపోయింది. అత్యవసరాల కోసం తప్పితే ప్రజలు బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుంది. ఆ తర్వాత ఎత్తివేసినప్పటికీ ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసే అవకాశముంది.

SBI ఇంటికే డబ్బులు
ఇప్పుడు ఏటీఎంలో డబ్బులు లేకపోవడం, బ్యాంకులు తెరిచి ఉండకపోవడం జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్లకు ఇబ్బందులు రాకుండా ఎస్బీఐ ఓ నిర్ణయం తీసుకుంది. అదే డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం. నగదు అత్యవసరమైతే డబ్బును పంపిణీ చేసేందుకు బ్యాంకులే మీ ఇంటికి వస్తాయి. నగదును ఇంటికి తెచ్చి ఇచ్చే వెసులుబాటును కల్పిస్తుంది.

ఎంపిక చేసిన బ్రాంచీల్లో..
ప్రస్తుతం ఈ నగదు డోర్ డెలివరీ సౌకర్యం సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఉంది. ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్ ఈ సౌకర్యాన్ని ఎంపిక చేసిన బ్రాంచీలలో మాత్రమే ప్రస్తుతం పొందగలరు.

నాగోన్ బ్రాంచీలో డోర్ స్టెప్ క్యాష్ ఫెసిలిటీ
ఈ మేరకు ఎస్బీఐ ట్వీట్ చేసింది. తమ నాగోన్ బ్రాంచీ స్టాఫ్ డోర్ స్టెప్ క్యాష్ ఫెసిలిటీ సౌకర్యం కల్పించడం ద్వారా కస్టమర్లకు ఇబ్బందులు లేకుండా చేసిందని ఆ ట్వీట్‌లో పేర్కొంది. ఈ మహమ్మారిపై కలిసి పోరాడుదామని కూడా పేర్కొంది.

SBI డోర్ స్టెప్స్ బ్యాంకింగ్ గురించి తెలుసుకోండి...
డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలో క్యాష్ పికప్, క్యాష్ డెలివరీ, చెక్ పికప్, చెక్ రిక్విసైషన్ స్లిప్ పికప్, ఫామ్ 15హెచ్ పికప్, డ్రాఫ్ట్ డెలివరీలు, టర్మ్ డిపాజిట్ అడ్వైస్ డెలివరీ, లైఫ్ సర్టిఫికెట్ పికప్, KYC డాక్యుమెంట్స్ పికప్ వంటివి ఉన్నాయి.

ఈ నెంబర్‌కు కాల్ చేయాలి
ఈ సర్వీసులు పొందేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1800111103 కు కాల్ చేయాలి. వర్కింగ్ డేస్‌లలో ఉదయం గం.9 నుండి సాయంత్రం గం. 4 వరకు ఫోన్ చేయవచ్చు.

వీరికి మాత్రమే ఈ సేవలు..
హోమ్ బ్రాంచీ సేవలు మాత్రమే లభిస్తాయి. అదీ కేవైసీ పూర్తి చేసిన అకౌంట్లకు మాత్రమే ఉంటుంది.

ఎస్బీఐ సర్వీస్ ఛార్జీ
ఎస్బీఐ ఈ సేవలకు గాను సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తోంది. నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు రూ.60, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు రూ.100 చెల్లించాలి. వీటికి జీఎస్టీ అదనం. రోజుకు ఒక ట్రాన్సాక్షన్ ద్వారా రూ.20,000 వరకు డబ్బులు ఇంటి వద్దకే పొందవచ్చు. డిపాజిట్‌కూ ఇది వర్తిస్తుంది. జాయింట్ అకౌంట్స్, మైనర్ అకౌంట్స్, నాన్ పర్సనల్ నేచర్ అకౌంట్స్‌కు సర్వీసులు అందుబాటులో లేవు.

5 కిలో మీటర్ల పరిధిలోనే ఉండాలి
అకౌంట్ హోల్డర్ వ్యాలిడ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ హోమ్ బ్రాంచీకి 5 కిలో మీటర్ల పరిధిలోనే ఉండాలి. అలా అయితేనే సేవలు వర్తిస్తాయి. చెక్కులు, విత్ డ్రా ఫామ్ ద్వారా కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐతో పాటు HDFC, ICICI, యాక్సిస్, కొటక్ మహీంద్ర బ్యాంకు కూడా డోర్ స్టెప్ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications