For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకు రూ.1 లక్ష: వివిధ డెబిట్ కార్డులపై SBI ఏటీఎం క్యాష్ ఉపసంహరణ పరిమితి...

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ కస్టమర్లకు ఏడు రకాల ఏటీఎం-డెబిట్ కార్డులను అందిస్తోంది. కార్డు వేరియెంట్ పైన ఆధారపడి రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితి ఉంటుంది. రూ.20,000 నుండి రూ.1 లక్ష వరకు నగదును ఏటీఎం నుండి తీసుకునే వెసులుబాటు ఉంది. జూలై 1వ తేదీ నుండి ఎస్బీఐ ఏటీఎం నుండి నగదు ఉపసంహరణ పరిమితిని సవరించింది. ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఎస్బీఐ తన రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులకు ఒక నెలలో 8 ఉచిత ట్రాన్సాక్షన్స్ ఇస్తుంది. ఇది మించితే ప్రతి లావాదేవిపై ఛార్జీ వసూలు చేస్తారు.

ఏటీఎంకు వెళ్తున్నారా.. మొబైల్ కచ్చితంగా వెంట తీసుకెళ్లండి!ఏటీఎంకు వెళ్తున్నారా.. మొబైల్ కచ్చితంగా వెంట తీసుకెళ్లండి!

రూ.1 లక్ష వరకు ఉపసంహరణ పరిమితి

రూ.1 లక్ష వరకు ఉపసంహరణ పరిమితి

ఎస్బీఐ డెబిట్ కార్డుపై రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితి ఇలా ఉంది...

- ఎస్బీఐ క్లాసిక్ అండ్ మాస్ట్రో డెబిట్ కార్డ్ పైన ఉపసంహరణ పరిమితి రూ.20,000 ఉంది.

- ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు పైన ఉపసంహరణ పరిమితి రూ.40,000 ఉంది.

- ఎస్బీఐ గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు పైన ఉపసంహరణ పరిమితి రూ.50,000 ఉంది.

- ఎస్బీఐ ప్లాటినమ్ ఇంటర్నేషల్ డెబిట్ కార్డు పైన నగదు ఉపసంహరణ పరిమితి రూ.1,00,000 ఉంది.

వీటిపై రూ.40,000 ఉపసంహరణ పరిమితి

వీటిపై రూ.40,000 ఉపసంహరణ పరిమితి

- ఎస్బీఐ ఇన్ టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డుపై ఒకరోజుకు నగదు ఉపసంహరణ రూ.40,000గా ఉంది.

- ఎస్బీఐ ముంబై మెట్రో కాంబో కార్డుపై ఉపసంహరణ పరిమితి రూ.40,000.

- ఎస్బీఐ మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉపసంహరణ పరిమితి రూ.40,000.

ఓటీపీ ఆధారిత సేవలు

ఓటీపీ ఆధారిత సేవలు

సెప్టెంబర్ 18వ తేదీ నుండి ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ నిబంధనను అమలు చేశారు. రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు మొత్తాన్ని ఏటీఎం నుండి ఉపసహరించుకుంటే కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. కస్టమర్లు నగదును ఉపసంహరించుకునే ప్రతిసారి డెబిట్ కార్డు పిన్ నెంబర్‌తో పాటు ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ 24x7 అందుబాటులో ఉంది.

English summary

రోజుకు రూ.1 లక్ష: వివిధ డెబిట్ కార్డులపై SBI ఏటీఎం క్యాష్ ఉపసంహరణ పరిమితి... | SBI daily cash withdrawal limit for different ATM cards

Country's largest lender State Bank of India (SBI) offers seven types of ATM-cum-debit cards to its customers. Depending upon the variant of the card, the daily cash withdrawal limit ranges from ₹20,000 to ₹1 lakh.
Story first published: Thursday, October 29, 2020, 13:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X