- పాస్ వర్డ్ ఏదైనా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ కలిపి పెట్టుకోవాలి. ఉదాహరణకు aBjsE7uG ఇలాంటి కాంబినేషన్ ఉండాలి.
- నెంబర్స్ అలాగే సింబల్స్ ఉపయోగించడం ఇంకా మంచిది. సింబల్స్ అంటే అక్షరాలు, అంకెలు, సంజ్ఞలను పాస్ వర్డ్‌గా పెట్టుకోవచ్చు. ఉదాహరణకు AbjsE7uG61!@.
- మీ పాస్ వర్డ్‌లో మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. అప్పుడే మీ పాస్ వర్డ్ సురక్షితంగా ఉంటుంది.
- సాధారణ డిక్షనరీ వర్డ్స్ లేదా సులువైన పదాలను పాస్ వర్డ్స్‌గా పెట్టుకోవడం సరికాదు. అంటే ఇది భద్రమైనది కాదు.
- కీ-బోర్డులో వరుసగా ఉండే పదాలను, సులభమైన నెంబర్లను పాస్ వర్డ్‌గా పెట్టుకోవద్దు.

- చాలామంది పాస్ వర్డ్ అనగానే 12345678 లేదా abcdefg అంటూ పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇవి చాలా సులువైనవి. కాబట్టి హ్యాకర్ల చేతికి సులువుగా చిక్కుతాయి.
- డోర్ బెల్, డోర్ ఇలాంటి సులువైన పాస్ వర్డ్స్‌కు కూడా దూరంగా ఉండాలి.
- పాస్ వర్డ్ పెద్దదిగా ఉండేలా చూసుకోవడం మంచిది. అంతేగాక మీ పేరు, పుట్టిన తేదీ, లేదా మీ కుటుంబ సభ్యుల పేర్లు, పుట్టిన సంవత్సరం వంటివి పాస్ వర్డ్‌గా పెట్టుకోవద్దు.
- బలమైన పాస్ వర్డ్ అధిక భద్రతను ఇస్తుందంటూ ఎస్బీఐ పేర్కొంది.


Click it and Unblock the Notifications