పెట్టుబడిదారులు వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో ఆలస్యాన్ని నివారించడంలో సహాయపడేందుకు పెట్టుబడి సలహాదారులచే ఫైనాన్స్‌లో రూల్ 72 సిఫార్స్ చేయబడింది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడి రెండింతలు కావడానికి ఎంత సమయం పడుతుందో ఈ నియమం ప్రాథమికంగా నిర్దేశిస్తుంది. అందుకే మీ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్స్‌స్ట్రుమెంట్‌కు రూల్ 72ను వర్తింపచేయడం ద్వారా మీ ఆర్థిక లక్ష్యాన్ని సాధించేందుకు సహాయపడే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల మీకు ఉపయోగపడుతుందో లేదో మరు నిర్దేశించుకోవచ్చు.

రూల్ 72
ఉదాహరణకు PPF వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంటే రూల్ 72 కాలిక్యులేటర్ ప్రకారం 10.14 సంవత్సరాలు పడుతుంది. అయితే పీపీఎఫ్ వడ్డీ రేటు స్థిరంగా ఉంటే మాత్రమే ఇది వర్తిస్తుంది. బ్యాంకులో 6 శాతం వడ్డీ రేటుతో మీరు రూ.5 లక్షల మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇది పన్నెండు సంవత్సరాలు తీసుకుంటుంది. 72ను వడ్డీరేటుతో భాగించాలి. ఒకవేళ మూడేళ్లలోనే మీ మొత్తానికి రెండింతలు కావాలనుకుంటే 72/3 చేయాలి. అప్పుడు 24 వస్తుంది. అంటే వడ్డీ రేటు 24 ఉంటే మాత్రమే మూడేళ్లలో రెండింతలు అవుతుంది.

బ్యాంకు FD
ప్రస్తుతం SBI, HDFC, యాక్సిస్, ICICI వంటి బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన 5 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. అంటే ఇక్కడ 72/5 అయితే 14 వస్తుంది. అంటే మీ మొత్తం వడ్డీ రేటు 5 శాతం వద్ద స్థిరంగా ఉంటే మీ మొత్తం రెట్టింపు కావడానికి 14 సంవత్సరాలు పడుతుంది.

PPF
ప్రస్తుతం PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. 72/7.1తో భాగిస్తే 10.14 సంవత్సరాలు. అంటే పీపీఎఫ్ అకౌంట్లోని మొత్తం రెండింతలు కావాలంటే స్థిర వడ్డీ రేటుతో 10.14 సంవత్సరాలు పడుతుంది.

SSY, KVP, NSC
సుకన్య సమృద్ధి యోజనపై(SSY) వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. 72/7.6ను భాగిస్తే 9.47 సంవత్సరాలు అవుతుంది.
కిసాన్ వికాస్ పత్ర(KVP) వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది. దీని ప్రకారం మీ మొత్తం వడ్డీ రేటు రెండింతలు కావడానికి 10.43 సంవత్సరాలు పడుతుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) ప్రకారం వడ్డీ రేటు 6.8 శాతంగా ఉంది. దీని ప్రకారం మీ మొత్తం రెండింతలు కావడానికి 10.5 సంవత్సరాలు పడుతుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications