Robert Kiyosaki: భవిష్యత్తులో దానికే విలువ ఎక్కువ ఉంటుంది.. రాబర్ట్ కియోసాకి..!

ఆర్థిక రచయిత, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఎప్పుడైనా బంగారం గురించి మాట్లాడేవారు. కానీ.. ఈ డిఫరెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్, బంగారం, బిట్ కాయిన్లపై పెట్టుబడులు పెడుతున్న సమయంలో నీటి ప్రాముఖ్యత గురించి ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. భవిష్యత్ లో నీటిపై పెట్టుబడి పెట్టడం పెరుగుతుందని అంచనా వేశారు. తెలివైన పెట్టుబడిదారులు ఇప్పటికే నీటి హక్కులపై దృష్టి సారించారని తన పోస్టులో పేర్కొన్నారు. ప్రముఖ పెట్టుబడిదారుడు మైఖేల్ బర్రీ ఎన్నో ఏళ్లుగా నీటి హక్కులను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మైఖేల్ బర్రీ 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగా గుర్తించిన పెట్టుబడిదారుల్లో ఒకరని తెలిపారు.

అమెరికాలో బిల్ గేట్స్ కు 2.7 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉందని చెప్పారు. అయితే గేట్స్ లక్ష్యం కేవలం వ్యవసాయం కాదన్నారు. ఆ భూములకు అనుబంధంగా ఉన్న నీటి హక్కులను భద్రపరచుకోవడమే ఆయన ఉద్దేశమని తెలిపారు. 'చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్-డే సెయింట్స్' వాషింగ్టన్ రాష్ట్రంలో వేల ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం కూడా నీటి హక్కులేనని రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. నీరు లేని భూమికి విలువ ఉండదని ఆయన చెప్పారు. భవిష్యత్ లో నీరు లేని భూమికి విలువ ఉండదని ఆయన పేర్కొన్నారు. రాబోయే కాలంలో తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మంచి నీటిలో దాదాపు 70 శాతం వ్యవసాయానికే ఉపయోగిస్తున్నామని తెలిపారు.

Water

భవిష్యత్ లో రాబోయే వాతావరణ మార్పులు, భూ గర్భ జలాల తగ్గుదల, జనాభా పెరుగుదల కారణంగా నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా, అరిజోనా, టెక్సాస్‌, కొలరాడో నది పరివాహక ప్రాంతాల్లో నీటి కొరత సమస్య ఇప్పటికే ఉందని చెప్పారు. ఇప్పటికే అమెరికాలోని సీఎంఈ గ్రూప్‌ ఇప్పటికే వాటర్‌ ఫ్యూచర్స్ మార్కెట్‌ను ప్రారంభించిందని గుర్తు చేశారు. ఇది చమురు మాదిరిగానే నీటిని కూడా ఆర్థిక మార్కెట్లలో ట్రేడ్ చేస్తుందని తెలిపారు. కాలిఫోర్నియాలో కొన్ని ప్రాంతాల్లో భూమి కంటే దానికి సంబంధించిన నీటి హక్కులకే ఎక్కువ విలువ ఉందని కియోసాకి గుర్తు చేశారు.

పెట్టుబడి సంస్థలు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, కొంతకాలం రైతులకు లీజుకు ఇచ్చి, అనంతరం ఆ నీటి హక్కులను నగరాలకు విక్రయించి భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని రాబర్ట్ కియోసాకి తెలిపారు. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు మ్యూచువల్ ఫండ్లు, సాధారణ పెట్టుబడుల్లో డబ్బు పెడుతుంటే, ధనవంతులు మాత్రం భూమితో పాటు దానికి సంబంధించిన నీటి హక్కులను కొనుగోలు చేస్తున్నారని గుర్తు చేశారు. నీటి కొరత పెరిగే కొద్దీ ఆ హక్కుల విలువ మరింత పెరుగుతుందని అంచనా వేశారు. తర్వాత వాటిని నగరాలకు విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం ద్వారా భారీ లాభాలు ఆర్జిస్తారని తెలిపారు. ప్రజలు ఏవి లేకుండా జీవించలేరో అలాంటి ఆస్తిని కొనుగోలు చేయాలని రాబర్ట్ కియోసాకి తెలిపారు. గత 100 సంవత్సరాల్లో ఆ ఆస్తి చమురైతే, రాబోయే 100 సంవత్సరాల్లో అది 'నీరు' అవుతుందని అంచనా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+