EPFO Withdraw: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. విత్ డ్రా పరిమితిని 75 శాతం నుంచి 90 శాతానికి పెంపు..!

ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. విత్ డ్రా నిబంధనల్లో కీలక మార్పు చేసింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బు తీసుకునే వారికి సింపులుగా డబ్బులు వచ్చేలా నిబంధనలు మార్చింది. రిటైర్మెంట్ ముందే తమ ప్రావిడెంట్ ఫండ్ పొదుపును మరింత సులభంగా, వేగంగా వాడుకునేలా ఈపీఎఫ్ఓ విత్‌డ్రా రూల్స్‌లో కీలక మార్పులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా నిబంధనల ప్రకారం 55 ఏళ్ల లోపు వయసున్న పీఎఫ్ ఖాతాదారులు ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌లో ఏకంగా 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇది నిబంధన ఉద్యోగులకు ఉపయోగపడనుంది.

గతంలో పీఎఫ్ డబ్బులు విత్ డ్రా పరిమితి 75 శాతంగా ఉండేది. ఇప్పుడు 90 శాతానికి పెంచింది. ఉదాహరణకు ఒక ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో రూ.2 లక్షలు ఉన్నాయనుకుంటే.. అత్యవసర పరిస్థితుల్లో ఆ ఉద్యోగి 90 శాతం వరకు అంటే.. రూ.1,80,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే నిరుద్యోగ ఉపసంహరణల విషయంలోనూ ఈపీఎఫ్ఓ కీలక మార్పులు చేసింది. గతంలో ఉద్యోగం పోయిన తర్వాత 12 నెలల వెయిటింగ్ పీరియెడ్ ఉండేది. ఇప్పుడు దాన్ని కేవలం 2 నెలలకు తగ్గించారు. ఉద్యోగం పోయిన రెండు నెలల తర్వాత పీఎఫ్ డబ్బులు పూర్తిగా విత్ డ్రా చేసుకోవచ్చు.

PF Withdraw

ఆర్థిక ఇబ్బందులు, పెద్ద ఖర్చుల సమయంలో ఉద్యోగులకు పీఎఫ్ సొమ్ము ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే రిటైర్మెంట్ కోసం దాచుకున్న సొమ్ము పూర్తిగా కరిగిపోకుండా తగిన రక్షణ ఏర్పాట్లను కూడా మార్పులు చేశారు. వైద్య చికిత్స, విద్య, వివాహం, ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు, స్థల కొనుగోలు, ఇల్లు నిర్మించడం, హోమ్ లోన్ చెల్లింపు, ఇంటి మరమ్మతులు వంటి అవసరాలకు పాటు ప్రత్యేక పరిస్థితుల్లోనూ డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. 2026 ఈపీఎఫ్ పథకం ప్రకారం ఈ నిబంధనలను ముఖ్య అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే 3 ప్రధాన విభాగాలుగా డివైడ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈపీఎస్ కనీస పింఛన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరు ఎదురు చూస్తున్నారు. కనీస పెన్షన్ రు.3000 చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే కనీస పింఛన్ రూ.7500 పెంచాలని ఉద్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+