రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్, డేటా లోన్ ఎలా తీసుకోవాలంటే?
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్. బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు డేటా అయిపోతే.. అది ముఖ్యమైన పని అయితే ఆ ఇబ్బంది చెప్పలేనిది. టాప్-అప్ వేయించుకునే సౌలభ్యం అందుబాటులో లేకుంటే ఇబ్బందికరమే. అయితే జియో వినియోగదారులు ఇక నుండి డేటా లోన్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఫోన్‌లో డేటా పూర్తిగా అయిపోతే అత్యవసరంగా డేటాను ఉపయోగించుకునేందుకు జియో సరికొత్త సౌకర్యాన్ని తీసుకువచ్చింది. డేటాను మొదట ఉపయోగించి, తర్వాత చెల్లించే ప్లాన్స్ తీసుకు వచ్చింది.

అలాంటప్పుడు ప్రయోజనకరం
ఒక్కో డేటా ప్లాన్‌తో 1GB హైస్పీడ్ డేటా లిమిట్ లభిస్తుంది. ప్రస్తుత డేటా ప్యాక్ పూర్తయ్యాక మరో డేటా టాప్-అప్‌ను కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఈ వెసులుబాటు ఎంతో ప్రయోజనకరం. ఎమర్జెన్సీ డేటా లోన్ ప్యాక్‌తో 1GB డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాల్యూ రూ.11. ఈ డేటా కాలపరిమితి బేస్ ప్లాన్ పైన అధారపడి ఉంటుంది. లోన్ పైన తీసుకున్న డేటాను బేస్ ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఉపయోగించవచ్చు. బేస్ ప్లాన్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే డేటా లోన్ ప్యాక్‌ను వినియోగించుకోగలుగుతారు.

మైజియో యాప్ ద్వారా...
ఒక్కో GB ప్యాక్ ఖరీదు రూ.11 కాగా, మైజియో యాప్ ద్వారా ఈ లోన్‌ను పొందవచ్చు. యూజర్ రీచార్జ్ ప్యాక్ కాలపరిమితి ముగిసిపోకుంటే మాత్రమే ఇది వర్తిస్తుంది. నిర్దేశించిన చెల్లింపు గడువులోగా ఈ డేటా లోన్‌ను మై జియో యాప్ ద్వారా తిరిగి చెల్లించవచ్చు.

డేటా లోన్ తీసుకోవడం ఇలా...
మైజియో యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దానిని ఓపెన్ చేశాక, హోం స్క్రీన్‌లో పైన ఎడమ వైపున ఉండే మూడు గీతలను క్లిక్ చేయాలి. అందులో మొబైల్ ఆప్షన్‌లో సబ్ ఆప్షన్‌గా ఉన్న ఎమర్జెన్సీ డేటా లోన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రొసీడ్‌ను ట్యాప్ చేసి గెట్ ఎమర్జెన్సీ డేటాను సెలక్ట్ చేయాలి. చివరగా యాక్టివేట్‌ను ట్యాప్ చేయాలి.


Click it and Unblock the Notifications