ఉద్యోగం లేక వ్యాపారం చేసిన వాళ్ళను చూసుంటాం ఇంకా తండి వ్యాపారాన్ని చేతుల్లోకి నడిపిస్తున్న వాళ్ళని చూసుంటాం కానీ తాను కలలు కన్నా వ్యాపారం కోసం బ్యాంక్ ఉద్యోగాన్ని కూడా వొదిలేసిన ఇతని సక్సెస్ స్టోరీ నిజంగా స్ఫూర్తినిస్తుంది. ఎందుకంటే ఇతను చేసే వ్యాపారం తన లాభం కోసం కాదు ఇతరులకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ తాను లాభపడుతున్నాడు. ఇందుకు అతని కష్టం అంత ఇంత కాదు కాదు చాలా ఏళ్ళు పట్టింది. మంచి జీతం వచ్చే జాబ్ వదులుకుని సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసి విజయం సాధించిన స్టోరీలు చాల చదివే ఉంటాం. కానీ ప్రస్తుతం కేరళలోని కొచ్చికి చెందిన అజయ్ గోపీనాథ్ కూడా ఈ కోవకు చెందినవాడే. మంచి జీతం ఉన్న ఉద్యోగం వదిలేసి ఎప్పటి నుండో కోరుకున్న వ్యాపారాన్ని ప్రారంభించి అజయ్ ప్రస్తుతం నెలకు రూ.5 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు.
అజయ్‌కు ఎప్పటి నుంచో మొక్కల పట్ల ఇష్టం ఎక్కువ, ఇప్పుడు తన ఆసక్తిని ఆర్థిక విజయంగా మార్చుకున్నాడు. మొత్తానికి అజయ్ స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటి అనే ప్రశ్నకు సమాధానం సింపుల్. కొచ్చిలోని తన ఇంటిలోని చిన్న గదిలో పోషకాలు అధికంగా ఉండే మైక్రోగ్రీన్‌లను పెంచుతున్న అజయ్ నెలకు రూ.5 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అజయ్ ఒక సక్సెస్ ఫుల్ వ్యవస్థాపకుడు. జిమ్‌లు, హాస్పిటల్స్, ఇంకా హోటళ్లకు పోషకాలు అధికంగా ఉండే మైక్రోగ్రీన్‌లను సప్లయ్ చేస్తున్నాడు.

అజయ్ సిటీ గ్రూప్‌లో పనిచేసేవాడు అన్నింటికంటే మంచి జీతం కూడా. అయితే 2017లో బెంగళూరులో ఉన్నప్పుడు అజయ్ జీవితం మారిపోయిందనడంలో డౌట్ లేదు. ఎందుకంటే అప్పుడు లంచ్‌టైమ్‌లో సలాడ్ ప్లేట్‌లోని చిన్న ఆకుకూరల పట్ల ఆకర్షితుడై, అతను వాటి పోషక సామర్థ్యాన్ని పరిశోధించడం, కనుగొనడం ప్రారంభించాడు. మొలక దశలో పండించిన కూరగాయలు, ధాన్యాలు ఇంకా మూలికల వంటి మైక్రోగ్రీన్‌లు సాంద్రీకృత పోషకాలను అందిస్తాయని గ్రహించాడు. దీనిపై ఆసక్తితో మైక్రోగ్రీన్‌ల గురించి మరింత సమాచారం సేకరించాడు. చాలా రోజుల పాటు దాని గురించి మరింత అధ్యయనం చేసిన తర్వాత, 2018 నాటికి అతను మైక్రోగ్రీన్స్‌పై తన ఆసక్తిని పరిశ్రమగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. 2018లో అజయ్ ఇంట్లో మైక్రోగ్రీన్‌లను పెంచడంలో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. సుమారు రెండు సంవత్సరాలు దీనిని అధ్యయనం చేసిన తరువాత, అతను ఈ సమయంలో చాలా ఉపయోగకరమైన అంశాలను తెలుసుకున్నాడు. ఈ విధంగా చాలా రీసెర్చుల తర్వాత డిసెంబర్ 2020లో అజయ్ బెంగళూరులోని తన బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి తన స్వస్థలమైన కొచ్చికి తిరిగి వచ్చాడు.
ఇక్కడ ఇంట్లో తన చిన్న గదిలో కేవలం రెండు ట్రేలలో చిన్న మైక్రోగ్రీన్‌లను పెంచడం ప్రారంభించాడు. అప్పుడు అతని స్నేహితుల నుండి సానుకూల స్పందనతో అజయ్ వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. 2022 నాటికి, అజయ్ తన ఇంటిలో 80 చదరపు అడుగుల గదిలో మైక్రోగ్రీన్స్ ఫారమ్‌ను పెంచడం ప్రారంభించాడు. తరువాత ఇండోర్ వర్టికల్ ఫార్మింగ్ పద్ధతులను ఉపయోగించి ప్రస్తుతం ముల్లంగి, ఆవాలు, బీట్ రూట్, సన్‌ఫ్లవర్ సహా 15 రకాలను పండిస్తున్నాడు.
అజయ్ ప్రతిరోజూ దాదాపు 5 కిలోల ఆకుకూరలు పండించి, గ్రో గ్రీన్స్ బ్రాండ్‌తో 100 గ్రాములు రూ.150 చొప్పున విక్రయిస్తున్నాడు. మైక్రోగ్రీన్స్‌లో విటమిన్లు సి, కె అండ్ బి12 వంటి పోషకాలు అలాగే పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి, అందుకే చాలా మంది మా ఉత్పత్తులను ఉత్సాహంతో కొంటుంటారు అని అన్నారు. అజయ్ భారతదేశం అంతటా ఫ్రాంచైజీలను స్థాపించాడు, ఇంకా 30 కంటే ఎక్కువ మైక్రోగ్రీన్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి రైతులకు సహాయం చేశాడు. మైక్రోగ్రీన్‌లు చాలా జాగ్రత్తగా నియంత్రించిన పరిస్థితులలో కోకోపీట్‌లలో పెరుగుతాయి. గది ఉష్ణోగ్రత 25 ° C కంటే తక్కువగా ఉండాలి. అలాగే గదిలో తేమ 40 నుండి 60 శాతం వరకు ఉంటుంది. తగిన పెరుగుదలకు అనుగుణంగా కృత్రిమ లైటింగ్ వ్యవస్థను కూడా రూపొందించాలి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications