ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరాగా ప్రతినెల నెల కొంత మొత్తం పెన్షన్ అందిస్తుంది. ఈ మొత్తం వారి జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకొని కేటాయిస్తుంది. అయితే ఈ పెన్షన్ కోసం అర్హులైన వారు అప్లయ్ చేసుకోవచ్చు. మన దేశంలో చాల రకాల పెన్షన్స్ ఉన్నాయి. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్లు కూడా ఉన్నాయి. కానీ ఈ పెన్షన్ స్కిం అందులో వేరు. రోజురోజుకి పెరుగుతున్న కాలుష్యానికి సంబంధించి ప్రభుత్వ యంత్రంగం ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి అలాగే పాత చెట్ల సంరక్షణ కోసం 'ప్రాణ్ వాయు దేవతా పెన్షన్ పథకాన్ని' ప్రారంభించింది. ఈ పథకం కింద 75 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న చెట్లకు పింఛను అందిస్తారు.
పథకం యొక్క మూలం మరియు లక్ష్యాలు
హర్యానా ప్రభుత్వం 5 జూన్ 2021న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పథకాన్ని ప్రారంభించింది. వృద్ధాప్య గౌరవ పింఛను తరహాలో అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. చెట్ల సంరక్షణను ప్రోత్సహించడం మరియు పచ్చదనాన్ని పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం.

చెట్లకు ఎంత పింఛన్ వస్తుందంటే ?
ఈ పథకం ప్రారంభంలో 75 ఏళ్లు పైబడిన చెట్లకు ఏడాదికి పింఛను రూ.2,500 ప్రకటించారు. ఇప్పుడు ఈ మొత్తం ఏటా రూ.2,750కి పెరిగింది.
ఎవరు పెన్షన్ పొందవచ్చు?
చెట్టు ప్రైవేట్ భూమిలో ఉంటే పింఛను మొత్తం నేరుగా భూమి యజమాని అకౌంట్ జమ అవుతుంది. గ్రామా పంచాయతీ పరిధిలోని భూమిలో చెట్లు ఉంటే సంబంధిత గ్రామా పంచాయతీకి పింఛను డబ్బు అందజేస్తారు. ఇందుకు
చెట్టు వయస్సును గుర్తించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. చెట్ల వయస్సును అంచనా వేయడానికి కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి.
చెట్టు మొదలు సైజ్ : చెట్టు వయస్సు మొదలు మందం ఆధారంగా అంచన వేస్తారు.
స్థానిక సమాచారం : చెట్టు చరిత్ర గురించి గ్రామస్తులు, ఉరి పెద్దల నుండి సమాచారం సేకరిస్తారు.
డ్రిల్ టెస్ట్ : చెట్టు ఖచ్చితమైన వయస్సు చెట్టు మందం అధ్యయనం చేయడం ద్వారా అంచనా వేస్తారు.
అప్లికేషన్లు ఎలా అంచనా వేస్తారు?
అటవీ శాఖ అప్లికేషన్ తీసుకున్న తర్వాత, ఒక కమిటీ దీనిపై దర్యాప్తు చేస్తుంది. అటవీ శాఖ బృందం చెట్టును పరిశీలించి కొన్ని ప్రమాణాల ఆధారంగా విచారణ నిర్వహిస్తుంది. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన చెట్లకు పింఛను మంజూరు చేస్తారు.
హర్యానా ప్రభుత్వం అన్ని జిల్లాల అటవీ అధికారుల నుండి 75 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న చెట్ల రికార్డులను కోరింది. పర్యావరణ పరిరక్షణతో పాటు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడమే దీని ముఖ్య లక్ష్యం. ఈ పథకం కింద దరఖాస్తు ప్రక్రియ మొదట వచ్చిన వారికి మొదటి సర్వీస్ ఆధారంగా అమలు చేస్తారు. మొదటి దశలో 20 చెట్లకు పింఛను మంజూరు కాగా, తరువాత దీనికి సంబంధించి మరిన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications