రూ.550 కోట్లు ఖర్చు పెట్టి కూతురు పెళ్లి.. తరువాత కంపెనీ దివాలా.. చివరికి జైలుకి.!!
వ్యాపారం ఒక వ్యక్తిని మంచి మార్గంలో గుర్తించగలదు అలాగే ఒక్క నిర్లక్ష్యం వల్ల జీవితకాలంలో ఇక కోలుకొని స్థాయికి తీసుకొస్తుంది. ఒకప్పుడు ప్రపంచాన్ని వావ్ అనిపించినా చాలా మంది కోటీశ్వరులు ఇప్పుడు దివాళా తీసి జైలులో ఉన్నారు. అంతేకాదు కొంతమంది రోజు ఖర్చుల కోసం భార్య, పిల్లలపై ఆధారపడుతున్నారు. JSW ఇస్పాత్ స్టీల్‌గా పిలవబడే ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా ఉన్న ప్రమోద్ మిట్టల్
ప్రమోద్ ఒకప్పుడు భారతదేశపు టాప్ వ్యాపారవేత్తలలో ఒకరు. 2020లో అతనికి రుణాలు ఇచ్చిన బ్యాంకులు అతన్ని దివాలా తీసినట్లు ప్రకటించాయి. ఆ సమయంలో అతనికి సుమారు 2.5 బిలియన్ పౌండ్లు అంటే భారతీయ రూపాయలలో 24,000 కోట్ల అప్పు ఉంది. ప్రమోద్ మిట్టల్ భారతీయ బిలియనీర్ అండ్ ఉక్కు వ్యాపారి లక్ష్మీ మిట్టల్ సోదరుడు.

అలాగే, ప్రమోద్ ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరుగా పేరు పొందారు. అతను తన లగ్జరీ లైఫ్ స్టయిల్ కి చాలా ఫెమస్ కూడా. అతను కొంచెం కూడా ఆలోచన లేకుండా ఖర్చు చేసేవాడు. కానీ అతను క్రింది స్థాయికి దిగజారడానికి కారణాలు లేవు. నివేదికల ప్రకారం, ప్రమోద్ 2013లో తన కుమార్తె సృష్టి వివాహానికి 550 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.
జూన్ 2020లో 68 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రమోద్ లండన్ కోర్టులో తన కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించాడు. అప్పటికి అతను ఇండియాకి తిరిగి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తనకు వ్యక్తిగత ఆదాయం లేదని, 130 మిలియన్ పౌండ్లు అప్పులో ఉన్నానని కోర్టుకు తెలిపాడు. ఢిల్లీలో తనకు కేవలం 45 పౌండ్ల ఆస్తి మాత్రమే ఉందని కూడా పేర్కొన్నాడు.
మోసం ఆరోపణలపై 2019లో ప్రమోద్ సహా మరో ఇద్దరు GIKIL అధికారుల్ని బోస్నియాలో అరెస్టు చేశారు. GIKIL బోస్నియన్ కోక్ నిర్మాత. ప్రమోద్ ఒకసారి GIKIL రుణాలకు హామీ ఇచ్చేందుకు అంగీకరించాడు. ప్రమోద్ గ్లోబల్ స్టీల్ హోల్డింగ్స్ GIKIL రుణాలకు హామీదారిగా సంతకం చేసింది.
GIKIL లండన్‌లోని స్టీల్ ట్రేడింగ్ గ్యారెంటీ కంపెనీకి లోన్ తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో కంపెనీ చట్టపరమైన చర్యలు తీసుకుంది. దీంతో ప్రమోద్ మిట్టల్ అంధకారంలో కూరుకుపోయాడు. ఇదిలా ఉంటే, ప్రమోద్ సోదరుడు లక్ష్మీ మిట్టల్ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరు. ఫోర్బ్స్ ప్రకారం, లక్ష్మీ మిట్టల్ నికర విలువ USD 15.5 బిలియన్లు.


Click it and Unblock the Notifications