For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Postal Insurance: ఏడాదికి రూ.399తో సూపర్ పాలసీ.. రూ.10 లక్షలు బెనిఫిట్స్.. మీరూ రక్షణ పొందండి..

|

Postal Insurance: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అనేక కుటుంబాలకు తీరని లోటును మిగిల్చింది. దీంతో ప్రజలు సైతం చాలా నేర్చుకున్నారు. కుటుంబ ఆర్థిక భద్రత కోసం ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్, ఇతర రిస్క్ కవర్ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఇండియా పోస్ట్ ఆఫీస్ తక్కువ ఖర్చులో ఎక్కువ కవరేజ్ అందించే పాలసీని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.

ఇన్సూరెన్స్ స్కీమ్..

ఇన్సూరెన్స్ స్కీమ్..

ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో అవి కేవలం కుటుంబాలకు వ్యక్తిగతంగానే కాకుండా ఆర్థిక కష్టాలను కలిగిస్తున్నాయి. ఒక వేళ ప్రమాదంలో ఇంటిని పోషించే వ్యక్తులు ఉన్నట్లయితే పరిస్థితులు పూర్తిగా తలకిందులవుతాయి. ఇలాంటి అనుకోని సందర్భాల్లో కుటుంబానికి ఆసరాను కలిగించేందుకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకోవటం తప్పనిసరి. ఇలాంటి వాటిని ధృష్టిలో ఉంచుకుని ఇండియన్ పోస్టల్ సర్వీస్ తక్కువ ఖర్చులో పాలసీని ప్రవేశపెట్టింది.

రూ.10 లక్షల కవరేజ్..

రూ.10 లక్షల కవరేజ్..

ప్రభుత్వ ఆధీనంలోని భారతీయ తపాలా శాఖ.. టాటా ఏఐజీ సంస్థతో కలిసి గ్రూప్‌ యాక్సిడెంట్‌ గార్డ్‌ పేరిట ఒక ఇన్సూరెన్స్ ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చింది. దీనికింద ఏడాదికి కేవలం రూ.399 చెల్లించి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కవర్ పొందవచ్చు. ఇందులో రూ.299 చెల్లించే స్కీమ్ కూడా ఉంది. అయితే.. ఈ రెండు పథకాల మధ్య ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. రూ.299 ప్రమాద రక్షణ పథకంలో మరణించిన వారిపై ఆధారపడిన వారి పిల్లల చదువుకు సహాయం అందుబాటులో ఉండదు.

ప్రమాదంలో గాయపడితే చికిత్సకు..

ప్రమాదంలో గాయపడితే చికిత్సకు..

యాక్సిడెంట్ కారణంగా ఆసుపత్రిలో చేరితే IPD ఖర్చుల కోసం గరిష్ఠంగా రూ.60 వేలు, అదే ఔట్ పేషెంట్ గా ట్రీట్ మెంట్ తీసుకుంటే గరిష్ఠంగా రూ.30 వేల పరిహారం లభిస్తుంది. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా రూ.10 లక్షలు లభిస్తుంది. పాలసీదారు మరణిస్తే.. అతనిపై ఆధారపడిన ఇద్దరు పిల్లల చదువుల కోసం గరిష్ఠంగా లక్ష అందించబడుతుంది.

ఖర్చులకు చెల్లింపు..

ఖర్చులకు చెల్లింపు..

మరణించిన పాలసీదారుని కుటుంబానికి అంత్యక్రియలకు రూ.5 వేలు అందిస్తారు. కుటుంబ ప్రయోజనాల కింద రూ.25 వేలు, ఆసుపత్రిలో రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున 10 రోజుల వరకు అందించటం జరుగుతుంది. ఇలా తక్కువ ప్రీమియంతో అద్బుతమైన ప్రయోజనాలను ఈ పోస్టర్ ఇన్సూరెన్స్ అందిస్తోంది.

English summary

Postal Insurance: ఏడాదికి రూ.399తో సూపర్ పాలసీ.. రూ.10 లక్షలు బెనిఫిట్స్.. మీరూ రక్షణ పొందండి.. | Postal Insurance scheme giving 10 lakhs cover for 399 rupees premium a year

Postal Insurance scheme giving 10 lakhs cover for 399 rupees premium a year
Story first published: Wednesday, August 31, 2022, 13:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X