PM Swanidhi: ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ వర్గాలను టార్గెట్ చేసి సంక్షేమ పథకాలను అమలు పరుస్తోంది. వాటిలో చాలా మందికి సరిగ్గా తెలియని ఓ పథకమే ప్రధానమంత్రి స్వనిధి యోజన.
ముఖ్యంగా వీధి వ్యాపారులు, విక్రయదారుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. బిజినెస్ నిర్వహణ మూలధనం కోసం ఫైనాన్సింగ్ అందించడానికి ప్రభుత్వం జూన్ 2020లో దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. PM స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (PM SWANidhi) కింద వీధి వ్యాపారులకు తక్కువ వడ్డీ రేట్లకే ఏడాది పాటు హామీ లోన్లు పొందే అవకాశం కల్పించింది.

కరోనా విజృంభణ కారణంగా వ్యాపారాల్లో తీవ్ర నష్టాలను చవిచూసిన వీధి విక్రేతలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించారు. వారికి ఆపరేటింగ్ క్యాపిటల్ ను సమకూర్చాలనే ఉద్దేశంతో ఫైనాన్సింగ్ చేసేందుకు అభివృద్ధి చేయబడింది. తద్వారా వారు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి చేయూతనిస్తుంది.
మార్చి 24 2020న లేదా అంతకు ముందు మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో విక్రయాలు జరిపే వీధి వ్యాపారులందరికీ పీఎం స్వనిధి పథకం అందుబాటులో ఉంటుంది. అయితే వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డు లేదా పట్టణ స్థానిక సంస్థలు (ULBలు) అందించిన విక్రయ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. ఒక విక్రేత 50 వేల వరకు హామీ-రహిత రుణాన్ని పొందవచ్చు. మొదటి విడతగా 10 వేలు, తిరిగి చెల్లించిన తర్వాత 20 వేలు, మూడో విడతలో 50 వేలు చొప్పున రుణం లభిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications