For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీఎం కిసాన్ యోజన డబ్బులు పడలేదా, ఇలా చెక్ చేయండి

|

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతుల ఖాతాలోకి క్రెడిట్ అయింది! రైతులకు సాగుకోసం అవసరమైన పెట్టుబడి సాయం కింద నరేంద్ర మోడీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో దీనిని తీసుకు వచ్చారు. ఈ నిధుల ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గడం లేదా తప్పడం వంటి ప్రయోజనం చేకూరుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా, ఒక్కో ధపా రూ.2000 చొప్పున మొత్తం రూ.6000 కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. పరిమిత వ్యవసాయ భూమి ఉంటే రైతు భరోసా వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రైతులకు పదో విడత కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు జమ అయ్యాయి.

అన్ని అర్హతలు ఉండి నగదు అందని రైతులు ప్రభుత్వం జారీ చేసిన హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఇది కాకుండా మీ ప్రాంతంలోని అకౌంటెంట్, వ్యవసాయ అధికారిని కూడా సంప్రదించవచ్చు. కిసాన్ సమ్మాన్ నిధి ఇన్‌స్టాల్‌మెంట్ అందకుంటే 011 24300606 హెల్ప్ లైన్‌కు కాల్ చేయవచ్చు.

హెల్ప్ లైన్ నెంబర్లు

PM Kisan Toll Free Number: 18001155266
PM Kisan Helpline Number: 155261
PM Kisan Landline Number: 011-23381092, 23382401
PM Kisan New Helpline: 011-24300606
PM Kisan Other Helpline: 0120-6025109
PM Kisan Email Id: [email protected]

PM Kisan Yojana: How To Check Status Online

కొన్నిసార్లు ప్రభుత్వం బదలీ చేసినప్పటికీ మీ ఆధార్ కార్డు, ఖాతా నెంబర్‌లో పొరపాటు ఉంటే సమస్య ఎదురు కావొచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రైతులకు ఏడాదికి రూ.6000 అందిస్తుంది.

ఆన్ లైన్ ద్వారా అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్ pmkisan.gov.in లోకి వెళ్లాలి.
అందులోని Beneficiary Status పైన క్లిక్ చేయాలి.
అక్కడ ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆప్షన్ సెలక్ట్ చేశాక, Check Data పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత స్క్రీన్ పైన పీఎం కిసాన్ స్టేటస్ కనిపిస్తుంది. అవసరమైతే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

English summary

పీఎం కిసాన్ యోజన డబ్బులు పడలేదా, ఇలా చెక్ చేయండి | PM Kisan Yojana: How To Check Status Online

The tenth installment of the financial benefit under Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN), was released on 1 January 2022 by Prime Minister Narendra Modi.
Story first published: Wednesday, January 5, 2022, 16:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X