For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాట్ ఫీచర్: PhonePe యూజర్లకు అందుబాటులోకి సరికొత్త ఫీచర్

|

మొబైల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే తమ కస్టమర్లకు మరో అద్భుత అవకాశాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. సాధారణంగా ఎవరికైనా అమౌంట్ ట్రాన్సుఫర్ చేయగానే లేదా రిసీవ్ చేసుకోగానే ఫోన్ చేసి వచ్చింది లేదా చెబుతాము. ఫోన్ చేయకపోయినా మరో మార్గంలో కన్‌ఫర్మ్ చేస్తాం. తమ ప్లాట్ ఫాం ద్వారా ట్రాన్సాక్షన్స్ మరింత సులువుగా జరిగేలా కస్టమర్లకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఆదాయపు పన్ను: అధిక వేతనం ఉంటే షాక్, పీఎఫ్, ఎన్పీఎస్‌లో ఆ వాటాపై పన్నుఆదాయపు పన్ను: అధిక వేతనం ఉంటే షాక్, పీఎఫ్, ఎన్పీఎస్‌లో ఆ వాటాపై పన్ను

ఇతర మెసెంజింగ్ యాప్స్ అవసరం లేకుండానే..

ఇతర మెసెంజింగ్ యాప్స్ అవసరం లేకుండానే..

ట్రాన్సాక్షన్స్ మరింత సులభతరం చేసేందుకు ఫోన్‌పే కస్టమర్లకు చాట్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్, ఓఎస్ ప్లాట్ ఫాంలలో చాలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పుడు మరే ఇతర మెసెంజింగ్ యాప్స్ అవసరం లేకుండా డబ్బును అడగవచ్చు లేదా ధృవీకరణ కోసం చెల్లింపు రసీదును సెండ్ చేసుకోవచ్చు.

చాట్ చేస్తూ ట్రాన్సాక్షన్ పూర్తి చేసుకోవచ్చు

చాట్ చేస్తూ ట్రాన్సాక్షన్ పూర్తి చేసుకోవచ్చు

ఫోన్ పే చాట్ ద్వారా కస్టమర్లు.. అవతలి వారితో చాట్ చేస్తూ ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేసుకోవచ్చు. ఈ చాట్‌కు సంబంధించిన చాట్ హిస్టరీ కూడా చాట్ ఫ్లోలో డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ కూడా సులభమవుతుంది. తమ చాట్ ఫీచర్ తమ కస్టమర్లకు మరింత అనుకూలంగా, ఆకర్షణీయంగా ఉంటుందని ఫోన్‌పే తెలిపింది.

కొద్ది రోజుల్లో మరో ఫీచర్

కొద్ది రోజుల్లో మరో ఫీచర్

రానున్న కొద్ది రోజుల్లో ఫోన్‌పే చాట్‌ను గ్రూప్ చాట్ ఫీచర్‌తో మరింత మెరుగు పరుస్తామని ఫోన్‌పే కో ఫౌండర్-సీటీవో రాహుల్ చారి తెలిపారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ పరికరాల కోసం వారం క్రితం లాంచ్ చేసిన ఈ ఫీచర్ 185 మిలియన్ల ఫోన్‌పే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. యాప్ ఓపెన్ చేసి కాంటాక్ట్ లిస్ట్ నుంచి మనం సంబంధిత కాంటాక్ట్ నెంబర్‌ను ఎంచుకోవాలి. సెండ్, చాట్ అనే రెండు యాప్షన్స్ ఉంటాయి. చాటింగ్ కోసం చాట్ ఆప్షన్‌ను, నగదు పంపించేందుకు సెండ్ ఆప్షన్ ఎంచుకోవాలి.

English summary

చాట్ ఫీచర్: PhonePe యూజర్లకు అందుబాటులోకి సరికొత్త ఫీచర్ | PhonePe users can now request and confirm money transfer

One of the leading digital payments platform in India, PhonePe has made the life of its users easier by introducing a new feature.
Story first published: Monday, February 3, 2020, 15:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X