Phone Pe: గుడ్ న్యూస్ చెప్పిన ఫోన్ పే.. నెట్ లేకుండా యూపీఐ పేమెంట్ చేయవచ్చు..!

ప్రస్తుతం దేశంలో యూపీఏ పేమెంట్స్ భారీగా పెరిగాయి. రూ.5 నుంచి రూ.లక్ష వరకు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. చాయ్ తాగినా యూపీఐ పేమెంట్, చిప్స్ ప్యాకెట్స్ కొన్నా యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. అయితే ఈ యూపీఏ పేమెంట్ చేయాలంటే కచ్చితంగా స్మార్ట్ ఫోన్ కావాలి. అంతే కాదు నెట్ కూడా ఉండాలి. అయితే ఫీచర్ ఫోన్లలో నెట్ ఉండదు. అంతే కాదు అందులో యూపీఐ యాప్స్ కూడా డౌన్ లోడ్ చేసుకోలేరు. ఈ నేపథ్యంలో ప్రముఖ యూపీఐ పేమెంట్ యాప్ ఫోన్ పే కీలక ప్రకటన చేసింది. ఇంటర్నెట్ లేకపోయిన యూపీఐ పేమెంట్ చేసేలా, అదీ కూడా ఫీచర్ ఫోన్లలో తీసుకురానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది.

ఇక నుంచి ఫీచర్ ఫోన్లను ఉపయోగించేవారు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చని ఫోన్ పే ప్రకటించింది. దీని ద్వారా దేశంలో 20 కోట్లకుపైగా ఫీచర్ ఫోన్ వినియోగదారులకు యూపీఐ సౌకర్యాలు అందించిన ఫ్లాట్‌ఫామ్‌గా ఫోన్ పే చరిత్ర సృష్టించనుంది. ఫోన్ పే యూపీఐ 123పే సేవల ద్వారా 2జీ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు యూపీఐ చెల్లింపులను సులభతరం చేసేందుకు ఫోన్ పే ఈ నిర్ణయం తీసుకుంది. ఫీచర్ ఫోన్లలో యూపీఐ చెల్లింపుల కోసం ఫోన్ పే సొంత సాంకేతికతతో పాటు ఎస్ఎంఎస్ ఆధారిత వ్యవస్థను ఉపయోగించనుంది.

Phone Pe

అయితే ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేసే విధంగా ఉండేందుకు నోకియా, హెచ్‌ఎండీ, లావా, ఐటెల్ వంటి తయారీ కంపెనీలతో ఫోన్ పే భాగస్వామ్యం ఏర్పచుకుంది. యూపీఐ 123పే ద్వారా ఫీచర్ ఫోన్లకు యూపీఐ పేమెంట్స్ సౌకర్యాన్ని విస్తరించే అవకాశం ఉంది. కేవలం స్మార్ట్‌ఫోన్లకే కాకుండా ఫీచర్ ఫోన్లకు కూడా యూపీఐ సౌకర్యాలను విస్తరించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఫోన్ పే తెలిపింది. 30 కోట్ల మందిని డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించింది. పర్సనల్ టూ పర్సనల్ నగదు ట్రాన్సాక్షన్లు, పీర్ టు మర్చంట్ పేమెంట్స్, కెమెరాలతో కూడిన ఫీచర్ ఫోన్లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంది.

బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేయడం, లావాదేవీల చరిత్రను యాక్సెస్ చేయడం లాంటివి చేయవచ్చని ఫోన్ పే తెలిపింది. ఆ కంపెనీ వినియోగదారులకు సహాయం అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ లైన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంగ్లీష్‌తో పాటు మొత్తం 12 భారతీయ భాషల్లో ఈ సేవలు కొనసాగిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో యుటిలిటీ బిల్లులు, మొబైల్ రీఛార్జ్ సేవలను కూడా ఇందులో చేర్చాలని భావిస్తోంది. జులై నాటికి ఫోన్‌పేకు 71.5 కోట్లకుపైగా నమోదిత వినియోగదారులు ఉండగా.. 5 కోట్లకుపైగా వ్యాపారులు ఫోన్ పే సౌండ్ బాక్స్ లు వాడుతున్నారు. నోకియా, హెచ్‌ఎండీ, లావా, ఐటెల్ ఫీచర్ ఫోన్లను కొనుగోలు చేస్తే అందులో ఫోన్ పే యాప్ ఇన్ బిల్ట్ గా వస్తుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+