అత్యవసరంగా లోన్ కావాలా? అలాంటి వారికి ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం గుడ్‌న్యూస్ చెప్పింది. రెండంటే రెండు నిమిషాల్లో రూ.2 లక్షల వరకు తక్షణమే లోన్ సౌకర్యం అందిస్తోంది. ఈ ఇన్‌స్టాంట్ లోన్ సేవలు 24X7, 365 రోజులు అందుబాటులో ఉంటాయి. పబ్లిక్ హాలీడేస్, వీకెండ్ రోజుల్లోను ఈ లోన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఎన్బీఎఫ్‌సీలకు పేటీఎం ఇప్పటికే టెక్నాలజీ, డిస్ట్రిబ్యూషన్ భాగస్వామిగా ఉంది. ఇప్పుడు శాలరైడ్ ఉద్యోగులకు, చిన్న వ్యాపారులకు, ప్రొఫెషనల్స్‌కు లోన్ సేవలు తక్షణమే అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ లోన్లను ప్రాసెస్ చేసి, ఇచ్చేవి ఎన్బీఎఫ్‌సీలు, బ్యాంకులు.

డిజిటల్ రూపంలోనే
ఇప్పటి వరకు లోన్లు తీసుకోని వారికి పేటీఎం ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ ఉపయోగపడుతుంది. పేటీఎం ఈ ప్రక్రియను డిజిటలైజ్ చేసింది. లోన్ అప్లికేషన్, మంజూరు కోసం ఫిజికల్ డాక్యుమెంటేషన్ అవసరం లేదు. అంతా డిజిటల్ రూపంలో ఉంటుంది. రెండు నిమిషాల్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు లోన్ మంజూరు చేస్తాయి. కొత్త లోన్ కస్టమర్ల తీసుకు రావడంతో పాటు చిన్న నగరాలు, పట్టణాల్లో ఇండివిడ్యువల్స్‌కు ఇది ప్రయోజనకరం.

18 నుండి 36 నెలల కాలపరిమితి
లోన్ అప్రూవల్ క్రెడిట్ స్కోర్, కస్టమర్ కొనుగోలు ప్యాటర్న్ పైన ఆధారపడి ఉంటుంది. 365 రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, రెండు నిమిషాల్లో రూ.2 లక్షల వరకు లోన్ అందిస్తామని పేటీఎం తన ప్రకటనలో తెలిపింది. ఈ లోన్ మొత్తాన్ని 18 నెలల నుండి 36 నెలల్లో చెల్లించాలి.

ఈ సెక్షన్‌లో దరఖాస్తు
ఈ పర్సనల్ లోన్‌కు అర్హత ఉన్నవారు పేటీఎంలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్షన్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్ అకౌంట్‌ను కూడా పేటీఎం యాప్ ద్వారా నిర్వహించవచ్చు. అర్హత కలిగిన కస్టమర్లు ఫైనాన్స్ సర్వీస్ సెక్షన్‌లోని పర్సనల్ లోన్ ట్యాబ్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సేవల కోసం పలు ఎన్బీఎఫ్‌సీలు, బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. బీటా దశలోనే 400 మంది సెలెక్టడ్ కస్టమర్లకు పర్సనల్ లోన్స్ జారీ చేసింది. ఏడాదికి పది లక్షల మందికి లోన్ ఇవ్వడాన్ని టార్గెట్‌గా పెట్టుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications