ఫ్రీగా కొత్త పాన్ కార్డు కావాలా.. ఇలా ఈజీగా అప్లయ్ చేసుకోండి..

పాన్ కార్ కార్డుతో ఆధార లింకింగ్, బ్యాంక్ అకౌంట్స్ కి పాన్ కార్డు అనుసంధానం తరువాత ఇప్పుడు పాన్ కార్డు 2.0 రాబోతుంది. పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) 2.0ని తాజాగా ఇండియాలో ప్రకటించిన సంగతి మీకు తెల్సిందే. అయితే ఈ కొత్త పాన్ 2.0 మరింత సెక్యూరిటీతో వస్తుంది అలాగే పాన్ కార్డుని క్యూఆర్ కోడ్‌తో అందిస్తున్నారు. పాన్ కార్డుని మొదటిసారిగా 2017-18లో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌లో పాన్ కార్డు వ్యక్తి ఫోటో, సంతకం, పేరు, తల్లిదండ్రుల పేరు, పుట్టిన తేదీ వివరాలు ఉంటాయి.

అయితే భారత ప్రభుత్వం త్వరలో అధికారికంగా పాన్ 2.0ను ప్రారంభించనుంది, అయితే చాలా మందికి ఇప్పటికే క్యూఆర్ కోడ్ లేని పాత పాన్ కార్డ్‌లు ఉన్నాయి. కాబట్టి పాన్ 2.0కి ముందు పాత పాన్ కార్డు ఉన్నవారు క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కోసం ఇలా అప్లయ్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి చార్జెస్ లేకుండా ఫ్రీగా అందిస్తున్నారు.

PAN 2 0 for free How to get PAN Card with QR code with address update online step-by-step guide

క్యూఆర్ కోడ్ వల్ల ఉపయోగం ఏంటి ?
పాన్ కార్డ్‌పై క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ ఈజీ చేస్తుంది, ఎందుకంటే పాన్ కార్డులో వ్యక్తి ఫోటో, సంతకం, పేరు, తల్లిదండ్రుల పేరు, పుట్టిన తేదీ వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. క్యూఆర్ కోడ్ లేని పాత పాన్ కార్డ్ ఇప్పటికి చెల్లుబాటు అవుతుంది కానీ కొత్త దానికి అప్‌డేట్ కావడం చాలా మంచిది. పైగా ప్రభుత్వం క్యూఆర్‌ కోడ్‌ ఉన్న పాన్ కార్డు తప్పనిసరి చేయలేదు. క్యూఆర్ కోడ్‌తో అప్‌గ్రేడ్ చేసిన కొత్త పాన్ కోసం అప్లయ్ చేయడానికి మీ పాత పాన్ వివరాలు, ఫోన్ నంబర్, పాన్ తో లింక్ చేసిన ఇమెయిల్ ఐడి కావాల్సి ఉంటుంది.

క్యూఆర్ కోడ్‌తో ePAN కార్డు కావాలంటే
స్టెప్-1: ముందుగా పాన్ 1.0 కోసం NSDL లేదా UTIITSLని ఓపెన్ చేయండి.

స్టెప్-2: ఇక్కడ క్యూఆర్ తో ePAN లేదా క్యూఆర్ కోడ్‌తో ఫిజికల్ పాన్ కార్డ్‌ పొందే అప్షన్ సెలెక్ట్ చేసుకోండి.

స్టెప్-3: ఇప్పుడు ePAN డౌన్‌లోడ్ చేయండి.

కొద్దిరోజుల క్రితం పాన్ జారీ చేసిన వారికి ePAN డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల మళ్ళి కొత్తగా డబ్బు కట్టాల్సిన పనిలేదని గుర్తుంచుకోండి. అయితే పాత PAN కార్డు యూజర్లు QR కోడ్‌తో ePAN కావాలంటే రూ. 8.26 చెల్లించాలి. అంతేకాదు క్యూఆర్ కోడ్‌తో పాన్‌ మీ ఇంటి అడ్రస్కి పోస్టులో కావాలంటే రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. మీ ఈ మెయిల్ ఐడికి క్యూఆర్ కోడ్‌తో ఉన్న ePAN PDF ఫార్మాట్‌లో వస్తుంది. ఇది పాస్‌వర్డ్‌తో ప్రొటెక్ట్ చేసి ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+