Personal Loan: ప్రస్తుతం దేశంలో చాలా మంది లోన్స్ కోసం వేటాడుతున్నారు. సగటున ప్రతి భారతీయుడి రుణాలు వేగంగా పెరిగిపోవటంపై రిజర్వు బ్యాంక్ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పర్సనల్ లోన్ కోసం ప్రయత్నించటానికి ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు లేదా అకస్మాత్తుగా డబ్బులు అవసరమైనప్పుడు ప్రజలు సహజంగా వ్యక్తిగత రుణాల కోసం వెతుకుతారు. ఈ క్రమంలో మీరు బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీ నుంచి రుణం కోసం ప్రయత్నించవచ్చు. పర్సనల్ లోన్ అనేది అసురక్షితమైన రుణం. ఈ క్రమంలో పర్సనల్ లోన్ తీసుకోవటానికి ముందు కొన్ని కీలక అంశాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

- సాధారణంగా ఎంతవరకు లోన్ పొందవచ్చనే విషయాన్ని పరిశీలిస్తే.. రుణగ్రహీతలు ప్రస్తుత రుణ బాధ్యతకు లోబడి నికర నెలవారీ ఆదాయంలో 20 రెట్లు వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలవారీ ఆదాయం రూ.1,00,000 ఉన్నట్లయితే వారు అత్యధికంగా రూ.20 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటికే మీరు ఒక రూ.5 లక్షలు పొందినట్లయితే మిగిలిన రూ.15 లక్షల రుణాన్ని పొందటానికి ప్రయత్నించినా బ్యాంక్ అంత మెుత్తాన్ని అందించటానికి అంగీకరించదు. రుణగ్రహీత చెల్లింపు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకునేందుకు రుణ సంస్థలు ఈ విధంగా చేస్తుంటాయి.
- అయితే ఇక్కడ పర్సనల్ లోన్ పొందటానికి వ్యక్తులు అందుకోసం ముందుగా కొన్ని కీలక డాక్యుమెంట్లు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. కావాల్సిన ముఖ్యమైన పత్రాలను పరిశీలిస్తే.. శాలరీ స్లిప్, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కంపెనీకి సంబంధించిన బేసిక్ వివరాలు ఇతర డాక్యుమెంట్లను సైతం బ్యాంకులు లేదా రుణ సంస్థలు అడుగుతుంటాయి.
- రుణం విషయంలో ముందుకు వెళ్లాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించుకోవటానికి ముందు ప్రతి ఒక్కరు గమనించేది వడ్డీ రేటు. వాస్తవానికి బ్యాంకింగ్ కంపెనీలు కొంత తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తుండగా.. నాన్ బ్యాంకింగ్ సంస్థలు మాత్రం భారీగా వడ్డీ రేట్లు చార్జ్ చేస్తుంటాయి. సాధారణంగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 12-18 శాతం మధ్య బ్యాంకులు వసూలు చేస్తుంటాయి.
- రుణాల విషయంలో అత్యంత కీలక పాత్ర ఎల్లప్పుడూ సిబిల్ స్కోర్ పైనే ఉంటుంది. ఎందుకంటే సిబిల్ ఎంత ఎక్కువగా, బలంగా ఉంటుందో అప్పుడు తక్కువ రేటుకు తక్షణ రుణం పొందటం సులభతరం అవుతుంది. CIBIL స్కోర్ అని కూడా పిలువబడే క్రెడిట్ స్కోర్, బ్యాంకు రుణగ్రహీతపై విధించే వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. అయితే రేటు ఎంత అనే విషయాన్ని సదరు వ్యక్తి క్రెడిట్ వర్థీనెస్, సిబిల్ స్కోర్ వంటి వివరాలకు అనుగుణంగా నిర్ణయించబడుతుంది. స్కోర్ ఎంత తక్కువగా ఉంటుందో అప్పుడు వడ్డీ రేటు అంత ఎక్కువగా నిర్ణయించబడుతుందని గుర్తుంచుకోవాలి. 700 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉండటం ఉత్తమమైనదిగా పరిణించబడుతుంది. తక్కువ సిబిల్ స్కోర్ ఉండే వ్యక్తి రుణ దరఖాస్తులను బ్యాంకులు సహజంగా తిరస్కరిస్తుంటాయి.
- అసలు ఏఏ కారణాలకు పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చనే విషయాన్ని గమనిస్తే.. సహజంగా అత్యవసర అవసరాలు, పెళ్లి ఖర్చులు, హౌస్ రెనోవేషన్, టూర్స్ వంటి కారణాల కోసం అందించబడుతుంటాయి. అయితే ప్రత్యేకంగా ఏ అవసరాలకు వీటిని ఇవ్వాలనే విషయంలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవని చెప్పుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. కాల్పుల విరమణపై ఏమన్నారంటే..



Click it and Unblock the Notifications