Home Loan: ఇండియాలో హోమ్‌లోన్ కావాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..!
Bank Loan: ఇల్లు కొనడం అనేది చాలా మంది మధ్యతరగతి భారతీయుల జీవితాల్లో ఉండే పెద్ద కల. అయితే దీనికోసం అనేక మంది గృహ రుణం తీసుకుంటుంటారు. అయితే హోమ్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరమో తెలియని అయోమయంలో అనేక మంది ఉంటుంటారు. లోన్ పొందటం కోసం రుణ సంస్థలకు తప్పక అందించాల్సిన డాక్యుమెంట్లు కొన్ని ఉంటాయి. వీటి ద్వారా మీ క్రెడిట్ వర్థీనెస్‌ను సదరు సంస్థలు అంచనా వేస్తుంటాయి. రుణాల మంజూరుకు ఈ పత్రాలు చాలా కీలకం.
ప్రాథమికంగా ప్రభుత్వం అందించే కింది డాక్యుమెంట్లు అవసరం ఉంటాయి.
1. ఆధార్ కార్డ్
2. పాన్ కార్డ్
3. ఓటర్ ఐడి కార్డ్
4. పాస్‌పోర్ట్
5. డ్రైవింగ్ లైసెన్స్

హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, పైన పేర్కొన్న డాక్యుమెంట్లు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యేవిగా ఉండాలి. అలాగే మీ పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా ఉండాలి. కాబట్టి ఏవైనా తప్పులు ఉన్నట్లయితే రుణ ప్రయత్నాలు ప్రారంభించటానికి ముందరే వాటిని సరిచేసుకోవటం ఉత్తమం.
చిరునామా ధృవీకరణ పత్రాలు:
1. భూమి/ఇంటి దస్తావేజు
2. యుటిలిటీ బిల్లులు (విద్యుత్, నీరు, గ్యాస్)
3. పాస్‌పోర్ట్
4. బ్యాంక్ ఖాతా వివరాలు
ఆదాయ రుజువు పత్రాలు:
రుణ అర్హతను నిర్ణయించడానికి ఫైనాన్స్ సంస్థలు మీ ఆదాయాన్ని అంచనా వేస్తారు. దీనికోసం కింద చెప్పబడిన పత్రాలు కీలకం..
1. జీతం పొందుతున్న వ్యక్తులైతే తాజా పే స్లిప్ (గత 3 నెలలు)
2. ఫారం- 16 లేదా ఆదాయపు పన్ను రిటర్న్‌లు (గత 2 సంవత్సరాలవి)
3. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు (జీతం, ఇతర ఆదాయాన్ని చూపే 6 నెలల స్టేట్‌మెంట్)
ఆస్తి పత్రం: ఇక్కడ మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఇంటికి సంబంధించిన పత్రాలు.
1. సేల్ అగ్రిమెంట్
2. ల్యాండ్ రిపోర్ట్
3. బిల్డింగ్ పర్మిషన్ ఎవిడెన్స్
4. హౌస్ డ్రాయింగ్స్
ఇతర పత్రాలు:
1. మీరు ఉమ్మడి గృహ రుణం కోసం దరఖాస్తు చేస్తున్నట్లయితే కొన్నిసార్లు మీ సహ దరఖాస్తుదారులకు సంబంధించిన వివరాలు సైతం బ్యాంకింగ్ సంస్థలకు అందించాల్సి ఉంటుంది.
2. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
3. మీరు ఏదైనా ఇతర లోన్ తీసుకుంటూ, లోన్ ట్రాన్స్‌ఫర్‌ని పొందాలనుకుంటే, మీ లోన్ కోసం మీ EMI చెల్లింపు వివరాలు ఇవ్వాల్సి రావొచ్చు.
రుణాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ వినియోగించి ఎంత రుణాన్ని ఎంత కాలానికి తీసుకుంటే నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ వాయిదా మెుత్తం ఎంతనే వివరాలను ముందస్తుగా గ్రహించవచ్చు. ఇది మీకు ఆన్‌లైన్‌లో సులభంగా కనుగొనవచ్చు. ఇవి మీరు పొందగల అసలు మొత్తం, వడ్డీ శాతం, మీ EMI వంటి వివరాలను స్పష్టంగా చూపుతుంది. అలాగే పై పత్రాలను సేకరించడం మీకు చాలా పెద్ద పనిలా అనిపించవచ్చు. కానీ అవన్నీ ఒక్కో ప్రయోజనాన్ని అందిస్తాయి. అయితే పూర్తి స్థాయిలో అన్ని లోన్ డాక్యుమెంట్లను అందించటం ద్వారా మెరుగైన వడ్డీ రేట్లకే రుణ సౌకర్యాన్ని పొందటంలో అవి దోహదపడతాయి.


Click it and Unblock the Notifications