PMBJP: రూ.2 లక్షల సాయంతో మెడికల్ షాప్.. అమ్మకాలపై 20 శాతం కమీషన్..

కేంద్ర ప్రభుత్వం మెడికల్ షాప్ పెట్టుకోవాలనుకునేవారికి ఓ పథకం తీసుకొచ్చింది. అదే ప్రధాన మంత్రి భారతీయ జనౌషది కేంద్ర యోజన(PMBJP). ఈ పథకం కింద దేశంలో వందల సంఖ్యలో మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 784 జిల్లాల్లో 776 జనౌషధి కేంద్రాలను నడుపుతున్నారు. ఈ మెడికల్ షాపుల్లో మెడిసిన్ తక్కువ ధరకే లభిస్తాయి. బయట షాపులతో పోలిస్తే ఇక్కడే అతి తక్కువ ధరలో మందులు లభిస్తాయి. ఈ మెడికల్ షాపుల్లో 2110 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అలాగే 315 రకాల సర్జికల్ వస్తువులు, వైద్య వినియోగ వస్తువులు, పరికరాలు కూడా ఈ షాపుల్లో దొరుకుతాయి. ఈ మందుల దుకాణాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా చేస్తోంది.

పథకం కింద అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. PMBJP పథకం కింద 'జన్ ఔషధి కేంద్రం' ఏర్పాటు చేయడానికి ఏ పౌరుడైనా, ఫార్మసిస్ట్, వైద్యుడు, నమోదిత స్వచ్ఛంద సంస్థ, స్వచ్ఛంద సేవా సంస్థ, ట్రస్ట్ లేదా పీఏసీఎస్ వంటి సహకార సంఘం అర్హులు. మందులను కొనుగోలు చేయడానికి ఆదాయం లేదా సామాజిక వర్గానికి సంబంధించిన ఎటువంటి నిర్దిష్ట పరిమితులు లేవు. చెల్లుబాటు అయ్యే వైద్యుని ప్రిస్క్రిప్షన్ ఉన్న ఎవరైనా వీటిని కొనుగోలు చేయవచ్చు. దరఖాస్తుదారులు కనీసం 120 చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని కలిగి ఉండాలి లేదా లీజుకు తీసుకుని ఉండాలి. జన్ ఔషధి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

PMBJP

ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ప్రారంభించేందుకు కేంద్రం రూ.2 లక్షల ప్రోత్సాహకం అందిస్తోంది. జన ఔషధి కేంద్రం ఏర్పాటు చేసుకుంటే మందుల అమ్మకాలపై 20 శాతం కమీషన్ చెల్లిస్తారు. ఎక్కువ విక్రయిస్తే ప్రోత్సాహకాలను కూడా ఇస్తారు. ఫర్నిచర్, కంప్యూటర్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైన వాటి కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.2 లక్షలు చెల్లిస్తుంది. జన ఔషధి కేంద్రం నిర్వహించాలంటే మీకు తప్పనిసరిగా ఒక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉండాలి. జన ఔషధి కేంద్రం ఆమోదం పొందిన తర్వాత ఫార్మసిస్ట్ పేరు, రిజిస్ట్రేషన్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

మహిళా పారిశ్రామికవేత్త, మాజీ సైనికుడు, దివ్యాంగులు, ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందినవారు, హిమాలయ ప్రాంతాలు, ద్వీప ప్రాంతాలు, లేదా ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారైతే ఒక సర్టిఫికేట్, అండర్‌టేకింగ్ సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.5 వేలు చెల్లించాలి. మహిళా పారిశ్రామికవేత్తలు, దివ్యాంగులు, ఎస్సీ/ఎస్టీ వ్యక్తులు, మాజీ సైనికులు, నీతి ఆయోగ్ గుర్తించిన ఆకాంక్షిత జిల్లాలు, హిమాలయ ప్రాంతాలు, ద్వీప ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు ఈ రుసుము చెల్లించకుండానే ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+