గత కొన్నేళ్లుగా ఎలక్షన్స్ ముందు ప్రభుత్వ ఖర్చుతో అమలు చేసే పథకాలు అంటే 'ఉచితాలు' గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు మనం ఇక్కడ అటువంటి పథకం గురించి మీకు చెప్తున్నాము, ఇందులో ప్రతిదీ ఉచితంగా లభిస్తుంది. అవును, ఇది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. కొంతమంది దీనిని ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం అని కూడా పిలుస్తారు.
మీరు సొంత ఊర్లో ఉంటే ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఒకప్పుడు గ్రామాల్లో వంట చేయడానికి గ్యాస్ లేక కట్టెలు లేక మహిళలు చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇంకా కట్టెల వల్ల వంట చేసేటప్పుడు పొగ కూడా ఎక్కువగా వ్యాపిస్తుంటుంది. మహిళల ఊపిరి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులలోకి ఈ కార్బన్ డయాక్సైడ్ చేరేది. ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి ప్రభుత్వం ఉచిత ఎల్పీజీ కనెక్షన్ అందించేందుకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అనే పథకాన్ని ప్రారంభించింది.

ప్రధానమంత్రి ఉజ్వల పథకం అంటే ఏమిటి?
పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు 01 మే 2016న పీఎం ఉజ్వల యోజన అనే పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. చాలా ఏళ్ల తర్వాత దీనికి కొత్త మెరుగులు దిద్దారు. ఇప్పుడు దీనిని ఉజ్వల యోజన 2.0 అని పిలుస్తారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ స్టవ్, గ్యాస్ రెగ్యులేటర్, గ్యాస్ పైపు ఇంకా మొదటి గ్యాస్ సిలిండర్ రీఫిల్ కూడా ఉచితంగా ఇస్తారు.
ఈ పథకం ముఖ్య ఉదేశ్యం ?
పెద్ద పెద్ద నగరాల్లో ఎంతో అభివృద్ధి సాధించినా.. కట్టెల పొయ్యిలపైనే మహిళలు వంటలు చేసే ఊర్లు మన దేశంలో ఇంకా చాలానే ఉన్నాయి. కట్టెల పొయ్యి పొగ స్త్రీలు, పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తాయి. అంతేకాకుండా, కలప పొగ పర్యావరణాన్ని కూడా కలుషితం చేస్తుంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా నిరుపేద మహిళలందరికీ ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్‌లను అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా వంటగదిని పొగ లేకుండా మార్చడంతోపాటు పర్యావరణం కూడా స్వచ్ఛంగా ఉంటుంది.
ఉచిత గ్యాస్ కనెక్షన్ ఎవరికి లభిస్తుంది?
ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కోసం కొన్ని అర్హత ప్రమాణాలను ప్రభుత్వం నిర్దేశించింది. మీరు ఈ పథకం ప్రయోజనాలను పొందాలనుకుంటే కొన్ని అర్హతలు ఉండాలి.
*ఈ గ్యాస్ కనెక్షన్ కోసం మహిళలు మాత్రమే అప్లయ్ చేసుకోవడానికి అర్హులు.
*దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
*ఇప్పటికే LPG కనెక్షన్ ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు కాదు.
*దరఖాస్తు చేసుకునే మహిళకి బ్యాంకు అకౌంట్ తప్పనిసరి ఉండాలి.
*SC, ST లేదా అత్యంత వెనుకబడిన తరగతి (MBC) కమ్యూనిటీకి చెందిన స్త్రీ లేదా కుటుంబానికి చెందినవారు అర్హులు.
*ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ SC/ST/MBC లబ్ధిదారులు అర్హులు.
*అంత్యోదయ అన్న యోజన (AAY) మహిళా లబ్ధిదారులు అర్హులు.
*టీ అండ్ మాజీ టీ తోటల తెగలకు చెందిన మహిళలు అర్హులు.
* అటవీ నివాస సంఘం మహిళలు అర్హులు.
*దీవులు ఇంకా నదీ ద్వీపాలలో నివసిస్తున్న మహిళలు అర్హులు.
పథకం కోసం అవసరమైన పత్రాలు
*ఆధార్ కార్డ్
*రేషన్ కార్డ్
*వయస్సు సర్టిఫికేట్
*బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్
*మొబైల్ నంబర్
*పాస్‌పోర్ట్ సైజు ఫోటో
అయితే, ఇప్పుడు ఈ పథకం కింద లబ్ధిదారులు గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డును అందించాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులు అడ్రస్ ప్రూఫ్‌గా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు
మీరు ఉజ్వల పథకాన్ని కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందాలనుకుంటే, మీరు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి. PM ఉజ్వల యోజనను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముందుగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన pmuy.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌కి ఓపెన్ చేయండి. ఇప్పుడు హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్‌సైట్ హోమ్ పేజీలో మీరు అప్లయ్ ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ నుండి కొన్ని ముఖ్యమైన సమాచారం సేకరిస్తుంది. చివరగా మీరు ఫ్రీ LPG గ్యాస్ కనెక్షన్ పొందుతారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications