For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంకా క్యూలో నిలుచుంటున్నారా? ఎస్బీఐ ADWMతో అన్ని బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రా మిషన్ (ADWM) ద్వారా కస్టమర్లు నగదును ఉపసంహరించుకోవడం మాత్రమే కాదు, కీలకమైన బ్యాంకింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఏదైనా అవసరం కోసం వరుసలో నిలబడకుండా ADWM కస్టమర్లకు ముఖ్యమైన బ్యాంకు సౌకర్యాలు అందిస్తుంది. కస్టమర్లకు సులభంగా, వేగంగా సౌకర్యాలు
అందించేందుకు బ్యాంకులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తాయి. ఇందులో భాగంగా ఎస్బీఐ ఇప్పటికే ADWMను తెచ్చింది.

PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరుPNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు

ఇదీ ADWM

ఇదీ ADWM

ADWM క్యాష్ డిపాజిట్ మిషన్ ఏటీఎం వంటిది. దీని ద్వారా ఏటీఎం కమ్ డెబిట్ కార్డును ఉపయోగించి నేరుగా ఖాతాలో నగదును జమ చేసుకోవచ్చు. ప్ర‌తిసారి బ్యాంకుకు వెళ్లవలసిన అవసరం లేకుండా మీ ఖాతాలో నగదును డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్సాక్షన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. ADWM ఉండగా మీరు లైన్‌లో ఎందుకు నిలబడతారంటూ ఈ ప్రభుత్వరంగ దిగ్గజం ఇటీవల ట్వీట్ చేసింది.

ఈ సేవలు అందుబాటులో

ఈ సేవలు అందుబాటులో

- క్విక్ అండ్ కన్వీనెంట్ క్యాష్ డిపాజిట్ అండ్ విత్‌డ్రా ట్రాన్సాక్షన్స్

- పేపర్‌లెస్ ట్రాన్సాక్షన్స్

- క్యాష్ డిపాజిట్ అండ్ విత్‌డ్రా (ఈ రెండు సౌకర్యాలు ఉంటాయి.)

- ఇక్కడ నగదును డిపాజిట్ చేయవచ్చు. మీ పీపీఎఫ్, ఆర్డీ, లోన్ అకౌంట్‌లలో కూడా డిపాజిట్ చేయవచ్చు.

- నగదు డిపాజిట్, స్వీయ లేదా థర్డ్ పార్టీ ఎస్బీఐ ఖాతాలోకి వెంటనే క్రెడిట్ చేయవచ్చు.

- ప్రతి ట్రాన్సాక్షన్ పరిమితి కార్డ్‌లెస్ డిపాజిట్‌కు రూ.49,900, డెబిట్ కార్డు ద్వారా రూ.2 లక్షలు. (పాన్ కార్డుతో అనుసంధానించిన అకౌంట్ ఆధారంగా.

200 వరకు కరెన్సీ నోట్లు..

200 వరకు కరెన్సీ నోట్లు..

- సింగిల్ ట్రాన్సాక్షన్‌కు 200 వరకు కరెన్సీ నోట్లు జమ చేసుకోవచ్చు.

- ఈ మిషన్ రూ.100, రూ.200, రూ.500, రూ.2000 వ్యాల్యూను మాత్రమే తీసుకుంటుంది.

- ఎస్బీఐ డెబిట్ కార్డును ఉపయోగించి సెల్ఫ్ అకౌంట్‌లో క్యాష్ డిపాజిట్ చేస్తే ఛార్జీలు లేవు.

- కార్డ్‌లెస్ డిపాజిట్, ఎస్ఎంఈ ఇన్‌స్టా/బిజినెస్ డెబిట్ కార్డును ఉపయోగించి క్యాష్ డిపాజిట్ చేస్తే స్వల్ప ఛార్జీ రూ.22 ఉంటుంది. జీఎస్టీ ఉంటుంది.

- ఈ మిషన్ ద్వారా ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకుల ఖాతాల్లోని నగదును ఉపసంహరించుకోవచ్చు.

- ఎస్బీఐ యోనో క్యాష్ ఎన్‌బుల్‌డ్ ADWM మిషన్లలో కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణకు మద్దతు లభిస్తుంది.

- మీ పాస్ వర్డ్‌ను మార్చుకోవచ్చు.

- బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. కార్డును స్వైప్ చేశాక ఆప్షన్ ఎంచుకోవచ్చు.

- మినీ స్టేట్‌మెంట్ ద్వారా ఖాతాలోని ట్రాన్సాక్షన్‌ను ట్రాక్ చేయవచ్చు.

- గ్రీన్ పిన్ కూడా జనరేట్ చేయవచ్చు.

- యోనో క్యాష్ ద్వారా రూ.20,000 వరకు కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణను చేయవచ్చు.

English summary

ఇంకా క్యూలో నిలుచుంటున్నారా? ఎస్బీఐ ADWMతో అన్ని బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు | No need for queue when SBI ADWM is there for key banking facilities

India's largest lender State Bank of India's (SBI) Automated Deposit and Withdrawal Machine (ADWM) allows its customers to avail key banking facilities and it is not only meant for withdrawing cash.
Story first published: Monday, February 8, 2021, 15:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X