పెన్షన్‌దారులకు ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షనర్లు ఇక నుండి ఏదేనీ ఎస్బీఐ బ్రాంచీ వద్ద లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించే వెసులుబాటును కల్పించింది. పెన్షనర్లకు ఉద్దేశించిన పెన్షన్ సేవా పోర్టల్ పునరుద్ధరణలో భాగంగా ఈ సౌకర్యాన్ని తీసుకు వచ్చింది. పెన్షన్‌కు సంబంధించిన వివరాలను ఈజీగా పొందే వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది. ఈ మేరకు ఎస్బీఐ ఓ ట్వీట్ చేసింది. అందరు పెన్షనర్లకు గుడ్‌న్యూస్, పెన్షన్ సేవా వెబ్ సైట్‌ను పునరుద్ధరించామని, అన్ని పెన్షన్ సేవలను మరింత సులభతరం చేసేలా తీసుక వచ్చామని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఉదాహరణకు పెన్షనర్లు కొత్త పోర్టల్ ద్వారా ఇక పెన్షన్ స్లిప్స్‌ను చాలా సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వారు ఫామ్ 16ను కూడా పోర్టల్ నుండి సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు వెబ్ సైట్ ద్వారా పెన్షన్ ట్రాన్సాక్షన్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు.

సేవా పోర్టల్ అందించే సేవలు...
- పెన్షనర్లు ఎస్బీఐ పెన్షన్ సేవా పోర్టల్ ద్వారా వారి పెన్షన్ స్లిప్/ఫామ్-16ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- సీనియర్ సిటిజన్స్ వారి పెన్షన్ ట్రాన్సాక్షన్స్ వివరాలను చూడవచ్చు.
- ఎరియర్స్ బ్యాలెన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- కస్టమర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ స్థితిని తెలుసుకోవచ్చు.
- పెన్షనర్లు తమ పెన్షన్ ప్రొఫైల్ వివరాలను కూడా సులభంగా చూడవచ్చు.

కొత్త ఫీచర్స్
ఇవే కాకుండా కొత్త పోర్టల్ ద్వారా పలు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు పెన్షనర్ల మొబైల్ ఫోన్స్‌కు అన్ని అలర్ట్స్ వస్తాయి. పెన్షన్ చెల్లింపు వివరాలతో పెన్షనర్ల మొబైల్ ఫోన్లకు ఈ సందేశాలు పంపిస్తుంది. అయితే ముఖ్యంగా లైఫ్ సర్టిఫికెట్‌ను ఏ బ్రాంచీలోనైనా సమర్పించడం అత్యంత ముఖ్యమైన మార్పు.
పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ సౌకర్యాన్ని అన్ని ఎస్బీఐ బ్యాంకు బ్రాంచీల్లోను పొందగలరు. అంతేకాదు, తన ఫిర్యాదుల మెకానిజంను కూడా సింప్లిఫై చేసింది.
మీరు మీ పెన్షన్ స్లిప్స్‌ను ఈ మెయిల్, పెన్షన్ చెల్లింపు శాఖ ద్వారా పొందవచ్చు.

సమస్యలు తలెత్తితే
- పెన్షన్ సంబంధిత సేవల్లో ఏదైనా సమస్య వస్తే అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను [email protected] కి మెయిల్ చేయాలి. లేదా UNHAPPY అని 80082 02020 కి ఎస్సెమ్మెస్ పంపించాలి.
- 24X7 కస్టమర్ కేర్ సర్వీస్ ద్వారా 1800 425 3800/1800 112 211 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ కాల్ చేసి, ఫిర్యాదు చేయవచ్చు.
కాగా, SBI తన కస్టమర్లకు ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్ నేపథ్యంలో క్రెడిట్ స్కోర్ లింక్డ్ హోమ్ లోన్స్‌ను తక్కువ ధరకే అందిస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది కాలంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లు, పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రుణ రేటు కూడా తగ్గింది. అయితే రుణరేటును పెంచేందుకు వివిధ బ్యాంకులు ఆఫర్లు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటును 6.7 శాతానికి ఇస్తున్నట్లు ప్రకటించింది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అలాగే, ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజును కూడా తొలగించినట్లు బ్యాంకు తెలిపింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications