కరోనా మహమ్మారి నేపథ్యంలో బ్యాంకులకు, ఏటీఎం సెంటర్స్‌కు కస్టమర్ల రాకను తగ్గించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) క్యాష్ ఉపసంహరణ విషయమై కొత్త రూల్స్ తీసుకు వచ్చింది. వీటి ద్వారా ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ పెరగడంతో పాటు బ్యాంకులకు, ఏటీఎం సెంటర్స్‌కు ఎక్కువ మంది రావడం తగ్గుతుంది. బ్రాంచీల వద్ద క్రౌడ్‌ను నిరోధించేందుకు నగదు ఉపసంహరణ కోసం నిర్దిష్ట తేదీలను కేటాయించింది.

కొద్దిగా సరి బేస్ విధానంలా..
నగదు ఉపసంహరణ కోసం బ్యాంకు కస్టమర్ అకౌంట్ నెంబర్‌లోని చివరి నెంబర్ ఆధారంగా తేదీలను కేటాయించారు. అంటే ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్యం తగ్గించేందుకు సరి - బేసి విధానం తీసుకు వచ్చినట్లుగా ఉంటుంది. ఈ విధానం ద్వారా బ్యాంకుల బయట ఎక్కువ మంది ఉండటం తగ్గుతుంది. పూర్తిగా సరిబేసి విధానం కాదు.. కానీ 0 నుండి 9 వరకు ఒక్కో తేదీని కేటాయిస్తారు.

ఉపసంహరణ వెసులుబాటు ఇలా..
ఉదాహరణకు బ్యాంకు అకౌంట్ నెంబర్ చివరలో 0 మరియు 1 ఉంటే వారికి మే 5వ తేదీన నగదు ఉపసంహరించుకునే వెసులుపాటు ఇస్తారు. ఇలా అకౌంట్ నెంబర్ చివరలో 2 మరియు 3 ఉంటే మే 5న, అకౌంట్ నెంబర్ చివరలో 4 మరియు 5 ఉంటే మే 6న ఉపసంహరించుకోవచ్చు. అకౌంట్ నెంబర్ చివరలో 6 మరియు 7 ఉంటే మే 8న, అకౌంట్ నెంబర్ చివరలో 8 మరియు 9 ఉంటే మే 11న ఉపసంహరించుకునే వెసులుబాటు ఇస్తారు.

ఆ తర్వాత పరిమితులు ఎత్తివేత
అంటే నెల ప్రారంభంలో వేతనం వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది వస్తారు. కాబట్టి ఇది మే 11వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నుండి ఈ పరిమితులు ఎత్తివేయబడుతుంది. బ్యాంకులవ ద్ద పెద్ద ఎత్తున కస్టమర్లు గుమికూడుతుండటంతో IBA ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా సామాజిక దూరం కూడా పాటించినట్లు అవుతుంది.

ఉపసంహరించుకున్నా ఛార్జీలు వర్తించవు
కరోనా నేపథ్యంలో ఏ బ్యాంకు ఏటీఎం నుండి ఉపసంహరించుకున్నా చార్జీలు పడవు. ఈ మేరకు IBA ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా, గరీబ్ కళ్యాణ్ యోజన కింద జన్ ధన్ అకౌంట్ కలిగిన మహిళల ఖాతాల్లో రూ.500 జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. వీటిని ఉపసంహరించుకోవడానికి తొందర పడవద్దని, ఈ అకౌంట్లలో పడిన డబ్బులు సురక్షితమని IBA తెలిపింది.


Click it and Unblock the Notifications