PF Latest News: పీఎఫ్ ఆర్గనైజేషన్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవల సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీ సర్కార్ తాజాగా ఉద్యోగుల భవిష్య నిధి(EPF), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కింద ఉద్యోగులను తప్పనిసరిగా కవర్ చేయాలని చూస్తోంది. ఇందుకోసం కేంద్రం ఉద్యోగి నెలవారీ జీతం పరిమితిని స్కీమ్ కింద రూ.30,000లకు పెంచవచ్చని సమాచారం. ఈ క్రమంలో ఈపీఎఫ్‌తో సమానంగా ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద కూడా వేతన పరిమితిని పెంచవచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కింద లబ్ధి పొందటానికి ఉద్యోగి నెలవారీ జీతం పరిమితి రూ.15,000గా ఉంది. ఇదే క్రమంలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) స్కీమ్ ప్రయోజనాలు పొందటానికి వేతన పరిమితి రూ.21,000గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న పాత వేతన పరిమితులను పెంచటం ద్వారా ఎక్కువ మంది ఉద్యోగులు బెనిఫిట్స్ పొందుతారని తెలుస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.15,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులు ఈపీఎఫ్ కవరేజీని నిలిపివేసే అవకాశం ఉంది. అయితే పరిమితిని పెంచటం ద్వారా కంట్రిబ్యూటర్ల సంఖ్య పెరగనుందని సమాచారం. గతంలో ఈపీఎఫ్ఓ కింద వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000కి 2014లో సరించిన సంగతి తెలిసిందే.

ఈపీఎఫ్ రూల్స్ ప్రకారం ప్రస్తుతం ఉద్యోగి, యజమాని 12 శాతం చొప్పున భవిష్య నిధికి ప్రతినెల వేతనంలో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఉద్యోగి అందించే వాటా పూర్తిగా భవిష్యనిధికి జమచేయబడుతుంది. అయితే యజమాని అందించే 12 శాతంలో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‍కి మిగిలిన 3.67% ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు జమచేయబడుతుంది. ఇక్కడ పాత రూల్స్ ప్రకారం ఉద్యోగి బేసిక్ పే రూ.15,000లో 12 శాతం అంటే రూ.1800 ఉద్యోగి చెల్లిస్తున్నారు.
కానీ ఇప్పుడు బేసిక్ శాలరీ పరిమితిని రూ.30,000కు పెంచితే ఇందులో 12 శాతం అంటే రూ.3,600 భవిష్యనిధికి కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే అనేక కార్పొరేట్ కంపెనీల్లో ప్రస్తుతం ఉద్యోగుల జీతం నుంచే యజమాని చెల్లించాల్సిన 12 శాతం కూడా లాక్కుంటున్నారు. ఒకవేళ మోదీ సర్కార్ లిమిట్స్ పెంచితే వేతన జీవులకు చేతికి వచ్చే జీతం మరింతగా తగ్గిపోయే ప్రమాదం ఉందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అదనంగా పీఎం మెుత్తం కాంట్రిబ్యూట్ చేయాలనుకునేవారికి వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే.
ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో దీనిపై ఫైనల్ డెసిషన్ ఉండొచ్చని తెలుస్తోంది. గత శనివారం జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో జీతాల పరిమితి పెంపుపై కొంత చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చాలా మంది ట్రస్ట్ సభ్యులు, కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుత పరిమితిని రెట్టింపు చేయడానికి అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది. ఒకవేళ భవిష్యత్తు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటే చట్టప్రకారం ఈపీఎఫ్, ఈఎస్ఐ కోసం 'ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్' మొత్తాన్ని యజమాని ఉద్యోగుల జీతం నుండి తీసివేయాల్సి ఉంటుంది. దానిని సదరు సంస్థల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఉద్యోగులకు చేతికి వచ్చే వేతనం మెుత్తం తగ్గవచ్చని నిపుణలు భావిస్తున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications