Mahila Samman Scheme: ఈ రోజుల్లో నమ్మి ఎవరి చేతిలోనూ డబ్బు పెట్టే పరిస్థితులు లేవు. డబ్బులు మన చేతిలో ఉన్నంత వరకే మనవి అన్నట్లు పరిస్థితులు దిగజారిపోయాయి. ఈ క్రమంలో మహిళలు తమ కష్టార్జితాన్ని ఎక్కువ రాబడి వచ్చే విధంగా దాచుకునేందుకు మోదీ సర్కార్ కొత్త స్కీమ్ బడ్జెట్ సమయంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
మోదీ ప్రభుత్వం 2023 బడ్జెట్‌లో 'మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్' అనే పథకాన్ని ప్రారంభించింది. దీనిలో మహిళలు తమ పొదుపులను పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందొచ్చు. స్కీమ్ మెచూరిటీ గడువు రెండేళ్లు. ఈ కాలంలో డిపాజిట్ చేసిన మెుత్తంపై 7.50 శాతం చక్రవడ్డీ అందుబాటులో ఉంటుంది. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా దీనిని రూపొందించారు. మధ్యలో అత్యవసర కారణాలతో మీరు డబ్బును ఉపసంహరించుకునేందుకు వీలు కల్పించబడింది.

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం కింద ఏ వయస్సులోనైనా ఖాతా తెరవొచ్చు. దీనికి ఎలాంటి వయోపరిమితి లేదు. మేనర్ బాలికలు సైతం తమ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఖాతాను తెరిచేందుకు వీలు ఉంది. అయితే అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఖాతా ఆటోమేటిక్‌గా ఆమె పేరుకు బదిలీ చేయబడుతుంది. దీనికోసం కేవైపీ ప్రక్రియ పూర్తి చేసి ఖాతాలో వెయ్యి రూపాయల నుంచి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చని గుర్తుంచుకోండి. దేశంలోని అనేక బ్యాంకులు ఈ స్కీమ్ ప్రస్తుతం అందుబాటులో ఉంచాయి.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం కింద కస్టమర్‌లు 1 సంవత్సరం తర్వాత వారి డిపాజిట్ చేసిన మూలధనంలో 40% వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని పొందుతారు. ఖాతాదారుడు ఏదైనా పరిస్థితుల్లో మరణిస్తే నామినీ ఈ సొమ్మును ఉపసంహరించుకోవచ్చు. అనారోగ్య సమస్యలతో కూడా డబ్బు ఉపసంహరణకు అనుమతి ఉంది. అయితే ఖాతాదారుడు ఏదైనా కారణం చేత ముందుగానే ఖాతాను మూసివేస్తే 7.50%కి బదులుగా.. వారికి 5.50% వడ్డీ చెల్లించబడుతుంది.


Click it and Unblock the Notifications