ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, ఒడిదొడుకులు ఉంటాయి. కొంతమంది ఈ సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్తుంటే మరికొందరు పోరాడి గెలుస్తారు. పోరాటాలకు లొంగకుండా పోరాడుతూనే ఉండేవారిలో ఆమె ఒకరు. భారతదేశ అత్యంత సంపన్న డిజైనర్లలో నిలిచి ఆమె పోరాట ఫలితం నేడు స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం రెండు కుట్టు మిషన్లతో బినిజెస్ స్టార్ట్ చేసి తన సంకల్పంతోనే రూ.1400 కోట్లకు పైగా ఫ్యాషన్ బ్రాండ్‌ను నిర్మించింది.
ఆమె ఎవరో కాదు అనితా డోంగ్రే. ఇండియాలోనే పాపులర్ ఫ్యాషన్ డిజైనర్. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, హాలీవుడ్ స్టార్ బియోన్స్‌తో సహా బ్రాండ్ అంబాసిడర్‌లతో ఆమెకి సొంత దుస్తుల బ్రాండ్ 'హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే' ఉంది.

ఆమెకి హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే పేరుతో ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఆమె ఫ్యాషన్ బ్రాండ్ విలువ అక్షరాలా రూ.1400 కోట్లు దాటింది. ఆమె డిజైన్ చేసిన బట్టలు మొదట రిజెక్ట్ చేసారు ఇంకా ఏ స్టార్ కూడా తీసుకోలేదు, కానీ నేడు ఆమె దేశంలోని టాప్ డిజైనర్లలో ఒకటి.
బట్టల షాపులో బట్టలు కుట్టే ఆమె తల్లి ద్వారా ఫ్యాషన్ పట్ల ఆమెకు ఆసక్తి వచ్చింది. అందులో అనిత స్ఫూర్తి పొందింది. 19 సంవత్సరాల వయస్సులోనే ఆమె ఫ్యాషన్ డిజైనర్ కావాలని నిర్ణయించుకుంది. ఫ్యాషన్ పరిశ్రమ అనుకూలంగా ఉండదని, తన కుమార్తె అందులోకి వెళ్లడం ఇష్టం లేకపోవడంతో ఆమె కుటుంబం మొదట ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది.
కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ అనిత అడుగడుగునా తల్లి సహకారం అందిస్తూనే ఉంది. ఆమె తన తోబుట్టువులతో పాటు కేవలం రెండు కుట్టు మిషన్లతోనే పనిని ప్రారంభించింది. కానీ మొదట్లో సవాళ్లు, ఇబ్బందులు ఎదురయ్యాయి. 50 మంది ఉన్న తన కుటుంబంలో మొదట డబ్బు సంపాదించిన మొదటి మహిళ అనిత. కేవలం 20 సంవత్సరాల వయస్సులో ఆమె సంపాదించడం ప్రారంభించింది ఇంకా ఆర్థికంగా స్వతంత్రంగా మారింది. కానీ అనిత అక్కడితో ఆగలేదు ముందుకు సాగుతూనే ఉంది. ఫ్యాషన్ అండ్ దుస్తుల బ్రాండ్ పరిశ్రమలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం లేదని ఆమె చూసింది. ఈ వాస్తవం ఆమెను బాధించింది, ఆమె ఈ అంతరాన్ని తొలగించాలని నిర్ణయించుకుంది. ఆమె తన బ్రాండ్‌ను 300 చదరపు అడుగుల స్థలం నుండి ప్రారంభించింది. ఆమె భారతీయ క్రాఫ్టింగ్‌ను వెస్టర్న్ ఫ్యాషన్‌తో కలిపింది. ఆమె బట్టలు అమ్ముడుపోనపుడు షాపింగ్ మాల్స్ ఇంకా ఫ్యాషన్ స్టోర్స్ నుండి తిరస్కరణను ఎదుర్కొంది.
ఆమె తన బట్టలు అమ్ముడవకపోవడంతోనే సొంత బ్రాండ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. 1995లో ఆమె తన మొదటి బ్రాండ్ స్టార్ ప్రారంభించింది. హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేలో AND (వెస్టర్న్ దుస్తులు), గ్లోబల్ దేశీ, పింక్‌సిటీ (నగలు) ఉన్నాయి. 2017లో ఆమె తన 53 సంవత్సరాల వయస్సులో మాన్‌హాటన్‌లో లగ్జరీ బ్రాండ్ గ్రాస్‌రూట్‌లను ప్రారంభించింది. ఫ్యాషన్ హౌస్‌లో మొత్తం 280 ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్‌లు ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం, అనిత మొత్తం విలువ రూ. 83.21 కోట్లతో భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళా ఫ్యాషన్ డిజైనర్. భారతీయ మీడియా ద్వారా తరచుగా "క్వీన్ ఆఫ్ ప్రేట్" అని పిలుస్తుంటారు. .
More From GoodReturns

Trending: స్కూల్ మానేస్తే రూ. 2.8 కోట్లు ఇస్తామన్నారు.. కానీ, ఈ 16 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడో చూడండి!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications