స్వచ్ఛమైన 3600 రకాల స్వదేశీ విత్తనాలు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ వ్యక్తి గురించి తెలుసా..

ఈ జనరేషన్లో కొన్ని కొన్ని మనం ముందు జనరేషన్స్ కోసం భద్రపరుస్తుంటాం. అవి వస్తువులైనా, మరేదైనా కానీ ఇక్కడ ఒక అతను చేసింది చూస్తే నిజంగా నమ్మలేరు. ఈ రోజులో ఎక్కువ డబ్బు ఆర్జించాలి అనే ఆశతో ప్రతిదానిని కల్తీ చేసి అమ్ముతున్నారు. ఇంకా తినే ఆహరం, పండించే పంట కూడా త్వరగా చేతికి అందేలాగా ఫెర్టిలైజర్స్ వాడి సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని తిన్నాక ఎలాంటి అనారోగ్యం వస్తుందో కూడా ఊహించలేరు. అయితే ఆర్గానిక్ ఫుడ్ లగే ఆర్గానిక్ ఫార్మ్ మీరు చూసి ఉండిచ్చు కానీ ఆర్గానిక్ విత్తనాలు పండించడం చూసారా...

దార్లపూడి రవి అనే వ్యక్తి సిమెంట్ పరిశ్రమలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆధునిక ఆహార పద్ధతులు వివిధ రకాల వ్యాధులకు ఎలా దారితీస్తాయో తెలుసుకున్నాడు. ఈ అవగాహన అతన్ని ఒక విత్తన బ్యాంక్(seed bank) నిర్మించడానికి ఎలా ఇన్స్పైర్ చేసిందో తెలుసా.... దార్లపూడి రవికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉంగరాడ గ్రామంలో ఐదు ఎకరాల భూమి ఉంది, ఇదే అతని ఉత్పత్తికి సూక్ష్మరూపం. చెరకు, వరి ఇంకా మామిడి తోటలు అన్ని ఇక్కడ కలిసి ఉన్నాయి. ఇతను ఒక కార్పొరేట్ ప్రొఫెషనల్‌గా మారిన 54 ఏళ్ల రైతు.

Meet Man From Andhra Pradesh Who Has Preserved 3600 Varieties of Indigenous Seeds in his farm land and house

నేను సిమెంట్ పరిశ్రమలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నప్పుడు అక్కడ నేను ఫ్యాక్టరీ పరిసరాల్లో ఇంకా చుట్టుపక్కల భారీ కాలుష్యం అలాగే ధూళిని చూశాను. ఈ ధూళి అంత ఎక్కడకి వెళ్తుంది అని ఆశ్చర్యపోయాను అని అన్నాడు. నా స్నేహితులు, బంధువులు చాలా మంది షుగర్, కడుపు నొప్పి ఇంకా ఇతర జబ్బులు వారు తినే ఆహారం కారణంగా గురవుతున్నారని నేను గ్రహించాను అని అతను గుర్తుచేసుకున్నాడు.

ఉదాహరణకు తెల్లటి పాలిష్ చేసిన బియ్యం 'కార్బోహైడ్రేట్‌లు అధికంగా అన్నాయి' అని, హై గ్లైసెమిక్ ఇండికేషన్ తో స్వచ్ఛమైన పిండి పదార్ధం అంటూ మార్కెట్‌లలో అమ్ముతున్నారు అని దార్లపూడి గమనించారు. ఈ ఆలోచన దార్లపూడి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి పచ్చటి పంటల వైపు మారేలా చేసింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని తన ఇంటిలో ఉన్న భూమి ఈ రైతు గత ఆహార పద్ధతులకు శక్తివంతమైన భవిష్యత్తును పొందేలా చేస్తుంది. తాను పెంచిన జెర్మ్‌ప్లాజమ్ బ్యాంకులో ఇప్పుడు 3,600 రకాల దేశీయ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని దార్లపూడి చెప్పారు .

బీన్, వరి, మొక్కజొన్న, గుమ్మడికాయలు ఇంకా కొన్ని రకాల విత్తనాలను ఉత్పత్తి చేయడం మీకు తెలుసా... తగిన పరిస్థితుల్లో నిల్వ చేసినప్పుడు శతాబ్దాల తర్వాత కూడా అవి మంచిగా ఉంటాయి. దార్లపూడి రవి గత కాలపు ఆహారపు అలవాట్లు ఎంత భిన్నంగా ఉన్నాయో చూసి ఆనందించి మా తాతముత్తాతల రోజుల్లో కూరగాయలు పండించడానికి పెరటి, ఇంటి తోటలు ఉపయోగించారు అని చెప్పారు. అతను తన ప్రయత్నాలకు సపోర్ట్ చేయడానికి నాలెడ్జ్ అవసరమని భావించి అతను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌లో సహజ వ్యవసాయ పద్ధతులలో శిక్షణా కోర్సు కోసం రిజిస్టర్ చేసుకున్నాడు. తరువాత రెండు సంవత్సరాల పాటు మట్టిలోని కార్బన్ కంటెంట్, మొక్కల పెరుగుదలలో దాని పాత్రను అర్థం చేసుకున్నాడు.

ఈ కోర్సు విత్తనాల ఎథ్నోసైన్స్‌పై అతని ఆసక్తిని పెంచింది. తరువాత అతను ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ అడవుల్లోకి వెళ్లి ఆ ప్రాంతంలోని గిరిజన సంఘాలు పండించే నమూనా విత్తన రకాలను సేకరించాడు. ఈ రోజుల్లో వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. ఫలితంగా విత్తనాలు వైవిధ్యభరితంగా ఉంటాయి, అని వివరించారు. కానీ ఈ గిరిజన ప్రాంతాల్లో మాత్రం విత్తనాలు రసాయనాల బారిన పడకుండా ఉన్నాయని గుర్తించారు. అంతే కాదు నేను నా భూమిలో ఇంటర్ క్రాపింగ్ కూడా అనుసరించాను, నా దగ్గర ఉద్యాన పంటలు, ఇంటర్ క్రాపింగ్, పచ్చి కూరగాయలు, ఆకు కూరలు కూడా ఉన్నాయి. నీటి పొదుపుపై ​​అవగాహన కల్పించేందుకు మైక్రో ఇరిగేషన్ అండ్ డ్రిప్ ఇరిగేషన్‌లను కూడా ప్రవేశపెట్టాను అని తెలిపారు.

దార్లపూడి రవి వల్ల ఊరిలో ఒక హీరో. ఇంకా అతను విత్తన సంరక్షణలో ఒక బాట పట్టాడు. అతనిని గుర్తించి పొరుగు గ్రామాల నుండి రైతులు విత్తనాలా గురించి సమాచారం పొందడానికి అతని ఇంటికి వచ్చేవారట. ఇప్పుడు కుకీలు, మిల్లెట్ బిస్కెట్లు, ఉప్మా, ఇడ్లీలు, రాగి లడ్డూ, పైనాపిల్ క్యాండీ ఉత్పత్తులు 'భాస్కర' బ్రాండ్‌తో అమ్ముడవుతున్నాయని రవి వివరించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) నుండి వచ్చిన డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూడు చెట్ల జాతులలో ఒకటి కంటే ఎక్కువ అంతరించిపోతున్నాయి. ఈ జన్యు కోత వేగంగా విత్తన రకాలను తుడిచిపెట్టేస్తోంది. విత్తన బ్యాంకులు ఈ సమస్యకు విరుగుడుగా ఉన్నాయి.

హరిత విప్లవంతో సంప్రదాయ దేశీయ విత్తనాల విలువ తగ్గింది . జన్యుమార్పిడి జనాదరణ పొందడంతో జన్యుపరంగా మెరుగుపడిన లక్షణాలు ప్రతికూల వాతావరణ ప్రాంతాల్లో విత్తనాలు మనుగడ సాగించడం కష్టతరం చేసింది. ఈ విత్తనాలు పరిమాణాన్ని ఇస్తాయి కాని నాణ్యతను ఇవ్వవు, దేశీ (స్థానిక రకాలు) రెండు ముఖ్యమైన లక్షణాలతో ఉంటాయి - అవి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగలవు ఇంకా మంచి సువాసనను ఇస్తాయి. అని అన్నారు.

విత్తన సంరక్షణలో మొదటి దశ విత్తన సేకరణ. "కొన్ని గంటల వర్షపాతం పక్కన పెడితే ఎక్కువ నీరు అందని గిరిజన ప్రాంతాలను ఎంచుకున్నాను. ఇది కరువు నివారించే విత్తనాలను సృష్టిస్తుంది. ఒడిశాలోని పొట్టంగి ప్రాంతం, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లోని సీతంపేట, కేరళలోని వేలూరు నుంచి విత్తనాలు సేకరించాను. వీటిలో ఔషధ విలువలు కలిగిన విత్తనాలు, వరి రకాలు ఇంకా అతని విత్తన బ్యాంకులో 40 రకాల బియ్యం, ఎరుపు ఓక్రా (లేడీస్ ఫింగర్), నల్ల బెండకాయ, గులాబీ బీన్స్, కాశీ టమోటా, ఎరుపు ఉసిరికాయ వంటి కూరగాయలు కస్తూరి పసుపు, నల్ల తులసి, సువాసనగల తులసి వంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఇప్పటి వరకు, అతను 300 మంది రైతులకు విత్తన సంరక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇచ్చాడు. కానీ, తన ప్రాంతంలో విత్తన సంరక్షణ వారసత్వం తనతో ఆగకూడదని ఆయన చెప్పారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+