మిల్లెట్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 75వ సెషన్‌లో 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా, ప్రభుత్వాలు నిర్వహించే వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా దేశాలు మిల్లెట్ ఉత్పత్తిలో చురుకుగా పాల్గొంటున్నాయి. ముఖ్యంగా మిల్లెట్ సాగును ప్రోత్సహించడానికి భారతదేశం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మెగా మిల్లెట్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించింది. వీటన్నింటి మధ్య వ్యాపారవేత్త అమిత్ సోని సక్సెస్ స్టోరీ ఒ ఎగ్జిబిషన్ సందర్భంగా వెలుగులోకి వచ్చింది, అయితే ఇక్కడ అతను మిల్లెట్ కుకీలలో స్పెషాలిటీ ఉన్న బేకరీని ప్రదర్శించాడు.
MBA గ్రాడ్యుయేట్ అయిన అమిత్ సోనీ గతంలో MNCలో ఉద్యోగం చేస్తూ 2017లో సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలనే కోరికతో వ్యాపార రంగంలో దూసుకుపోయాడు. 2019లో అతను RD'z 1983ని స్థాపించాడు, ఇది మిల్లెట్ ద్వారా చేసిన కుక్కీలకి ప్రశంసలు పొందిన ఫెమస్ బేకరీ. అతను రాజస్థాన్‌లోని ICAR డిపార్ట్‌మెంట్ నుండి మిల్లెట్ కేక్ కోసం ఆర్డర్ అందుకున్నప్పుడు సరైన మిల్లెట్ కుకీని రూపొందించడంలో ఉన్న పద్ధతులు స్పష్టంగా కనిపించాయి. దీని నుండి ప్రేరణ పొందిన అతను మిల్లెట్ కుకీలను తయారు చేయడంలో సాహసం చేసి ఛాలెంజ్ నిరూపించుకున్నాడు.

మొదట్లో ఈ ప్రక్రియ గురించి తెలియని అమిత్ 57-58 ట్రయల్స్‌కు చేసి ఫెయిల్ అయ్యాడు, అతను సరైన కుకీస్ సాధించే వరకు పదార్థాలతో ప్రయోగాలు చేశాడు. 97 కంటే ఎక్కువ ప్రయత్నాల తర్వాత తన పట్టుదల ఫలించింది, ఇది ఖచ్చితమైన, సరైన మిల్లెట్ కుకీల సృష్టికి దారితీసింది. జింలో పర్సనల్ ట్రైనర్ అతని నెక్స్ట్ క్లయింట్‌గా మారాక పురోగతి వచ్చింది.
అతని బేకరీ RD'z 1983 అనే పేరుకి ఒక సెంటిమెంట్ వాల్యూ ఉంది. 'RD' అనేది అతని తల్లిదండ్రుల పేర్లను సూచిస్తుంది. రమేష్ఇం అతని తండ్రి పేరు కాగా, దుర్గ అతని తల్లి పేరు. అయితే '1983' అతని తల్లితండ్రుల పెళ్లి రాజును సూచిస్తుంది. ఏడాదికి రూ. 35 లక్షల టర్నోవర్‌తో మొదలైన ఈ బేకరీ చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించింది ఇప్పుడు దాదాపు రూ. 1.5-2 కోట్ల వార్షిక టర్నోవర్‌తో ఉంది.
అమిత్ బేకరీ అభివృద్ధి పై కీలక విషయాలను కూడా వెల్లడించారు. 2023 ప్రారంభంలో అతను ప్రతిరోజూ 3 నుండి 4 కిలోల కుకీలను ఉత్పత్తి చేసాడు. అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి గొప్పగా పెరిగి రోజుకు 50 నుండి 55 కిలోల కుకీల ఉత్పత్తికి చేరుకుంది.


Click it and Unblock the Notifications