ఒక్క ఐడియాతో ఉద్యోగం మానేసి వ్యాపారం.. రోజుకు రూ.3 వేలు సంపాదన..ఈమె సూపర్ వుమెన్..
ఈ రోజుల్లో వ్యాపారం అనేది ఖర్చుతో అలాగే మంచి ఐడియాతో కూడుకున్నది. మనలో చాల మంది ఎంతో మంది సరైన ఉద్యోగం దొరకక లేదా సరిపడా జీతం లేక ఉద్యోగం కంటే వ్యాపారమే మేలని భావిస్తుంటారు. అయితే వ్యారంలో పురుషులే కాదు మహిళలే కూడా పోటీ పడుతూ సక్సెస్ అవుతున్నారు. ఒకప్పుడు మహిళలు అంటే వంటింటికి పరిమితం అనేది పాత మాట ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు పోటీగా రాణిస్తున్నారు. ఇందుకు ఎంతో మంది ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు. చిన్న చిన్న పెట్టుబడి ఆలోచనలతో ఇంటి దగ్గరే సంపాదిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో పెళ్ళైన మహిళలు ఉద్యోగం లేద వ్యాపారం చేయాలంటే ఇల్లు, పిల్లల భాధ్యతలు అడ్డొస్తుంటాయి.
కానీ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మహిళా ఉన్నతమైన చదువులు పూర్తి చేశాక ఉద్యోగం చేయడం ఇష్టం లేక వ్యాపారం చేయాలనీ నిర్ణయించుకుంది. అనుకున్నట్టే ఓ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. సంధ్య స్థానికంగా దుర్గ భవాని మిల్లెట్స్ అనే పేరుతో మిల్లెట్ హోటల్‌ను రెండేళ్లుగా నడిపిస్తూ మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ వస్తున్నారు.

సంధ్య ఎంసీఏ పూర్తి చేసాక ఇంట్లో ఆమెకి పెళ్లి చేశారు. పెళ్లి తరువాత ఉద్యోగం ప్రయత్నం చేసినా ఆశించిన జీతం రాకపోవడంతో ఇంట్లోనే ఉంటూ వ్యాపారం చేయాలనే ఆలోచన చేసింది. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, పౌష్టిక ఆహారం పై ఎక్కువ దృష్టి పెట్టడంతో మిల్లెట్ తో టిఫిన్స్ చేద్దామని ఆలోచన చేసి తన భర్త శ్రవణ్ సలహాలతో మిల్లెట్ టిఫిన్స్ స్టార్ట్ చేసింది. మొదటి నుండే మంచి నాణ్యత పాటిస్తూ రుచికరమైన టిఫిన్స్ అందించడంతో వ్యాపారంలో సంధ్య విజయం సాధించింది.
ఈ మధ్య కాలంలో పెరుగుతున్న ఖర్చులకు చాలీ చాలని ఆదాయం, ఇంట్లో ఒక్కరు కష్టపడితే కుటుంబం గడవలేని పరిస్థితులు ఉన్నాయి. దింతో భర్త శ్రవణ్ సంపదనకి తోడుగా నిలిచేందుకు ఉద్యోగం చేద్దామని ఆలోచనతో తరువాత ఈ వ్యాపారంలో స్థిరపడ్డానని సంధ్య తెలిపింది. ఉద్యోగం చేస్తే వచ్చే ఆదాయం కన్నా వ్యాపారం ద్వారా సంపాదన మాత్రమే కాకుండా నాతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నందుకు చాల సంతోషంగా ఉండాలి తెలిపింది. సంధ్య ప్రకారం తన వ్యాపారం ద్వారా రోజుకు 3 వేల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి తన భర్త సహకరించాడని కూడా అన్నారు.


Click it and Unblock the Notifications