Stock Market: 2026లో 9.37 శాతం క్షీణించిన స్టాక్ మార్కెట్లు.. ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా..
పశ్చిమ ఆసియా భారతీయ స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి. 2026లో ఇప్పటివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 9.37 శాతం క్షీణించింది. ఈ నేపథ్యంలో మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలా వద్దా.. చాలా మందికి సందేహంగా ఉంది. ప్రస్తుత మార్కెట్, గతంలో మార్కెట్ ఎలా ఉందనేది పలు సంస్థలు రీసెర్చ్ చేశాయి. ఫండ్స్ ఇండియా రీసెర్చ్ ప్రకారం 1980 నుంచి సెన్సెక్స్ సగటున ఏడాది మధ్యలో సుమారు 20% క్షీణతను చవిచూసింది. అయినప్పటికీ 1980 జూన్ 2026 మధ్య ఉన్న 46 సంవత్సరాలలో 37 సంవత్సరాలు మార్కెట్ రాణించింది.
సెన్సెక్స్ లాభాలను నమోదు చేసిన 37 సంవత్సరాలు 23 సంవత్సరాలు 10 శాతం నుంచి 20 శాతం మధ్య ఏడాది మధ్యలో క్షీణతను చూశాయి. మరో తొమ్మిదేళ్లలో సూచీ 20 శాతం కంటే ఎక్కువ దిద్దుబాట్లు చోటుచేసుకున్నాయి. దాదాపు ప్రతి ఏడు నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి 30 శాతం కంటే ఎక్కువ క్షీణించాయి. సగటున మార్కెట్ కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయికి కోలుకోవడానికి దాదాపు ఒక సంవత్సరం మూడు నెలలు పట్టింది. అయితే పూర్తి పతనం-పునరుద్ధరణకు రెండు సంవత్సరాల నాలుగు నెలల పాటు టైమ్ పట్టింది.

2000 సంవత్సరం తర్వాత జరిగిన కొన్ని అతిపెద్ద దిద్దుబాట్లకు కొద్దిగా ముందు మార్కెట్లో ప్రవేశించిన పెట్టుబడిదారులను ఇండియా రీసెర్చ్ సర్వే చేసింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో దాదాపు 60 శాతం మార్కెట్ పడిపోయింది. 2015 లో దాదాపు 22 శాతం మార్కెట్ పతనం అయింది. చారిత్రక పనితీరు భవిష్యత్ రాబడులకు హామీ ఇవ్వదు, అలాగే ప్రస్తుత దిద్దుబాటు ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. అయితే గత నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న డేటా ప్రకారం, భారతీయ ఈక్విటీలలో మార్కెట్ క్షీణత అనేది కామన్. సైకిల్ ప్రకారం మార్కెట్ కొనసాగుతుందని అర్థం చేసుకోవచ్చు.
అయితే కొన్నిసార్లు క్వాలిటీ స్టాక్స్ మార్కెట్ సంబంధం లేకుండా వృద్ధిని సాధించాయని గుర్తుంచుకోవాలి. ముఖ్య విషయం ఏమిటంటే.. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. సరైన అవగాహన లేకుండా పెట్టుబడి పెడితే మార్కెట్లు పెరిగినా. తగ్గినా సంబంధం లేకుండా నష్టపోయే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లపై అవగాహన లేకుంటే.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం బెటరని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications