Pancard News: మైనర్లకు కూడా పాన్ కార్డు ఉంటుందా..? పిల్లల పేరిట ఇన్వెస్ట్ చేస్తుంటే ఇలా చేయండి!
Pancard or minors: ప్రస్తుతం దాదాపు ప్రతి లావాదేవీకి పాన్ కార్డ్ సమర్పించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. తద్వారా ఆదాయపు పన్ను అధికారులు చాలా తేలికగా సదరు వ్యక్తి జరిపే ట్రాన్సాక్షన్స్‌ను ట్రాక్ చేయవచ్చు. పెద్దవారికి సరే మరి పిల్లలకు కూడా పాన్‌కార్డ్ ఉంటుందని చాలా మందికి తెలియదు. కానీ ఇది నిజం మైనర్లు కూడా పాన్ కార్డు పొందవచ్చు.
ఆదాయపు పన్ను ఫైలింగ్ సహా పలు లావాదేవీల్లో పాన్‌కార్డ్ కీలక పాత్ర పోషిస్తుంది. KYC ధ్రువీకరణ పత్రంగా కూడా దీన్ని ప్రభుత్వం అంగీకరిస్తోంది. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు కూడా పాన్ కార్డ్ పొందేందుకు నిబంధనలు ఉన్నాయి. అయితే పిల్లల పేరు మీద వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

సాధారణంగా పిల్లల పేరుమీద ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్న సమయంలో వారికి పాన్ కార్డ్ అవసరం అవుతుంది. ఒకవేళ తల్లిదండ్రుల పెట్టుబడులకు వారిని నామినీగా చేర్చేందుకు పాన్ వినియోగిస్తారు. ఇక మైనర్ల పేరిట బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడు, వారికి ఏదైనా ఆదాయ వనరు ఉన్న పక్షంలో పాన్ సమర్పించాల్సి ఉంటుంది.
పెద్దలకు పాన్ ఎలాగైతే అప్లై చేస్తామో మైనర్ల కోసం కూడా దాదాపు అదే పద్ధతి ఫాలో కావాలి. ఇందుకోసం ఫారమ్ 49Aని వినియోగించాలి. ఈ ఫారమ్‌పై గార్డియన్‌గా తల్లిదండ్రుల సంతకం తప్పనిసరి. వివరాల అప్‌లోడ్ సమయంలో పిల్లల బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఫోటో సహా ఇతర అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాత అది పనికిరాదని గమనించాలి. ఎందుకంటే మైనర్‌లకు జారీ చేయబడిన పాన్ కార్డ్‌లో వారి ఫోటో లేదా సంతకం ఉండదు. కాబట్టి ఆ వ్యక్తులు తప్పనిసరిగా పాన్ కార్డ్ అప్‌డేట్ కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలి.


Click it and Unblock the Notifications