ప్రస్తుతం వంట గ్యాస్ సరఫరాపై వస్తున్న వార్తలు సామాన్యులను కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే గ్యాస్ కొరత ఏమీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ.. సిలిండర్ల పంపిణీలో పారదర్శకత కోసం బుకింగ్ విధానాల్లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. వీటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో గ్యాస్ రీఫిల్ కోసం కనీసం 21 రోజులు వేచి ఉండాల్సి రాగా.. ఇప్పుడు ఆ కాలాన్ని 25 రోజులకు పెంచింది. అంటే ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో దాని కోసం 25 రోజులు ఆగాల్సి ఉంటుంది. అయితే మీ గ్యాస్ బుకింగ్ (gas booking) ప్రక్రియ మరింత ఈజీగా ఉండాలంటే ఈ 4 మార్గాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చు.

1. వాట్సాప్ (WhatsApp) ద్వారా బుకింగ్
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. మనం రోజూ వాడే వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ బుక్ చేయవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి కింద పేర్కొన్న నంబర్లకు మెసేజ్ చేస్తే సరిపోతుంది..
- ఇండేన్ (Indane): 7588888824 నంబర్‌కు "REFILL" అని మెసేజ్ పంపండి.
- భారత్ గ్యాస్ (Bharat Gas): 1800224344 నంబర్‌కు "Hi" అని మెసేజ్ చేయండి.
- హెచ్‌పీ గ్యాస్ (HP Gas): 9222201122 నంబర్‌కు "Hi" అని పంపండి.
ఇలా వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మెసేజ్ పంపిన వెంటనే మీ బుకింగ్ పూర్తవుతుంది. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది.
2. మిస్డ్ కాల్ (Missed Call) పద్ధతి
మీ దగ్గర ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా పర్వాలేదు. కేవలం ఒక మిస్డ్ కాల్ ద్వారా కూడా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. మీ గ్యాస్ ప్రొవైడర్ నంబర్‌కు మీ రిజిస్టర్డ్ ఫోన్ నుండి కాల్ చేస్తే చాలు:
- ఇండేన్ (Indane): 8454955555
- భారత్ గ్యాస్ (Bharat Gas): 7710955555
- హెచ్‌పీ గ్యాస్ (HP Gas): 9493602222
ఈ విధానం ముఖ్యంగా నెట్‌వర్క్ సరిగ్గా లేని గ్రామీణ ప్రాంతాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
3. మొబైల్ యాప్స్ , వెబ్‌సైట్లు
మనం నిత్యం వాడే పేటీఎం (Paytm), గూగుల్ పే (Google Pay), ఫోన్‌పే (PhonePe) వంటి యాప్స్ ద్వారా కూడా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. యాప్‌లో 'రీఛార్జ్ & పే బిల్స్' సెక్షన్‌కు వెళ్లి, 'బుక్ ఏ సిలిండర్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ కస్టమర్ ఐడి లేదా మొబైల్ నంబర్ ఇస్తే బుకింగ్ పూర్తవుతుంది. వీటితో పాటు ఇండియన్ ఆయిల్ వన్, హలో హెచ్‌పి వంటి అధికారిక యాప్స్ కూడా వాడుకోవచ్చు.
4. IVRS కాల్ ద్వారా
ఇక వీటితోపాటు కాల్ చేసి ఆటోమేటెడ్ వాయిస్ సూచనల ద్వారా కూడా గ్యాస్ బుక్ చేయవచ్చు. ఉదాహరణకు ఇండేన్ కస్టమర్లు 7718955555 కు కాల్ చేసి సూచనలు పాటిస్తే సరిపోతుంది. బుకింగ్ సమయంలో మీ 16 అంకెల ఎల్‌పిజి ఐడి (LPG ID), డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) వంటి వివరాలను సిద్ధంగా ఉంచుకోవడం మర్చిపోవద్దు.
మొత్తంగా చూస్తే గ్యాస్ బుకింగ్ ప్రక్రియను కంపెనీలు ఇప్పుడు చాలా సులభతరం చేశాయి. పైన పేర్కొన్న పద్ధతుల్లో మీకు నచ్చిన దానిని ఎంచుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ రీఫిల్ పొందవచ్చు. నిబంధనలు మారుతున్నా సరైన అవగాహన ఉంటే సకాలంలో సిలిండర్ పొందడం పెద్ద కష్టమేమీ కాదు.
More From GoodReturns

LPG గ్యాస్ సంక్షోభం.. PNG గ్యాస్ కనెక్షన్ ఎలా పొందాలి.. ఆన్లైన్ బుకింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications