షేర్లపై లోన్ తీసుకునే వారు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి.. లేకుంటే మొత్తం నష్టపోతారు...

ఈ రోజుల్లో ఆర్థిక అవసరాలు ఏ క్షణానైనా మన ముందుకు రావచ్చు. వ్యాపార విస్తరణ, ఆరోగ్య అత్యవసరం, విద్యా ఖర్చులు లేదా ఇంటి నిర్మాణం వంటి అవసరాలు మనకు ఎదురవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ మంది తాకట్టు రుణాలను పరిగణిస్తారు. గతంలో ఆస్తి లేదా బంగారం ప్రధాన పూచీకత్తు అయితే.. ఇప్పుడు కాలానుగుణ మార్పులతో స్టాక్‌లపై రుణాలు (Loan Against Shares - LAS) ప్రముఖంగా మారాయి. పెట్టుబడులుగా ఉన్న షేర్లు ఇప్పుడు కేవలం సంపద కాదు, అవసర సమయంలో తక్షణ సహాయాన్ని అందించే ఆర్థిక సాధనాలుగా మారాయి.

షేర్లపై రుణం అంటే ఏమిటి?: బ్యాంకు లేదా NBFC వద్ద బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నట్లు.. మీ డీమ్యాట్ ఖాతాలోని షేర్లను పూచీకత్తుగా చూపించి రుణం పొందడమే LAS. రుణం యాక్టివ్‌లో ఉన్నప్పటికీ డివిడెండ్లు, బోనస్‌లు, స్టాక్ స్ప్లిట్లు అన్నీ మీకే వస్తాయి. తాత్కాలిక తాకట్టు గుర్తు ఉంటుంది.. యాజమాన్యం మాత్రం పూర్తిగా మీదే.

loan against shares LAS loan stock backed loan margin calls risk share collateral crash pledging shares loan risk equity backed loans loan against securities stock market crash impact loans collateral liquidation risk forced selling shares margin funding risk borrowing against stocks loan against mutual funds financial leverage risks stock volatility impact equity pledge loan dangers bank margin call rules loan default collateral interest rate loan against shares safe borrowing strategies stock market risk management collateral value drop funding through pledged shares Loan against shares Telugu

ఎంత రుణం పొందవచ్చు?: RBI ప్రస్తుత రూల్ ప్రకారం షేర్ల మార్కెట్ విలువలో గరిష్టంగా 50 శాతం వరకు రుణం పొందవచ్చు. ఉదాహరణకు, మీ షేర్లు ప్రస్తుతం రూ. 20 లక్షల విలువ కలిగి ఉంటే, గరిష్ట రుణం రూ. 10 లక్షలు పొందవచ్చు. ఇక RBI కొత్త ప్రతిపాదన ప్రకారం ఈ LTVను 50 శాతం నుండి 60 శాతం చేయడం, వ్యక్తులకు గరిష్ట రుణ పరిమితిని రూ. 1 కోట్లకు పెంచడం పరిశీలనలో ఉంది.

మార్కెట్ పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది: భావోద్వేగ పెట్టుబడిదారులకు ఇది ప్రమాద ప్రాంతంగా చెప్పవచ్చు. ముందు చెప్పినట్లుగా రూ. 20 లక్షల విలువ ఉన్న షేర్లపై రూ. 10 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం. మార్కెట్ క్రాష్ అయి స్టాక్ విలువ 20 నుంచి 30 శాతం పడిపోతే, మీ రుణ LTV 50 శాతం పరిమితిని దాటిపోతుంది. ఉదాహరణకు విలువు రూ. 14 లక్షలకే తగ్గితే, LTV 63 శాతానికి పెరుగుతుంది. ఈ సమయంలో బ్యాంకు లేదా బ్రోకర్ మార్జిన్ కాల్ ఇస్తారు. అంటే వెంటనే డబ్బు జమ చేయండి లేదా అదనపు షేర్లు పూచీకత్తుగా పెట్టండని చెబుతారు.

మీరు స్పందించకపోతే ఏమవుతుంది: రుణదాతకు మీ షేర్లను అమ్మేసి తన డబ్బు తిరిగి తెచ్చుకునే చట్టపరమైన హక్కు ఉంటుంది. చాలాసార్లు రుణగ్రహీతకు T+3 లేదా T+5 వరకు సమయం ఇవ్వబడుతుంది. కానీ పరిస్థితికి అనుగుణంగా మరుసటి రోజు కూడా అమ్మే అవకాశం ఉంటుంది. మార్కెట్ అత్యంత అస్థిరంగా ఉన్నప్పుడు, ఇది ఇన్వెస్టర్‌కు భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.

ఎప్పుడు LAS సేఫ్: నిపుణులు రెండు వేర్వేరు పోర్ట్‌ఫోలియోలను నిర్వహించమని సూచిస్తున్నారు. ఒకటి తాకట్టు పెట్టడానికి, మరొకటి దాని జోలికి పోకపోవడం. మొదటిది అయిన తాకట్టు పోర్ట్‌ఫోలియోలో బ్లూ చిప్స్, అధిక లిక్విడిటీ స్టాక్స్ మాత్రమే ఉండాలి. రెండవ దానిలో చిన్న కంపెనీల స్టాక్స్, SME స్క్రిప్ట్స్ లేదా అతి అస్థిర స్టాక్స్‌తో LAS తీసుకోవడం ప్రమాదకరం.

LAS ఎవరికి అనుకూలం?
తక్కువకాలిక అవసరాలకు
తమ పెట్టుబడుల భవిష్యత్తుపై నమ్మకం ఉన్న వారికి
షేర్లను వెంటనే అమ్మకుండానే నిధులు అవసరమైనప్పుడు
లాభదాయకమైన అవకాశాలను కోల్పోకుండా కాష్ అవసరమైన వారికి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
40-45 శాతం కంటే ఎక్కువ LTV వద్ద రుణం తీసుకోకండి
మార్కెట్ ట్రెండ్‌ను పర్యవేక్షించండి
మార్జిన్ కాల్‌లకు ప్రతిస్పందించడంలో ఆలస్యం చేయకండి
లోన్ బాధ్యతగా మాత్రమే వినియోగించండి

షేర్లపై రుణం ఒక శక్తివంతమైన ఆర్థిక సాధనం. అది పెట్టుబడులను అమ్మకుండా అత్యవసర నిధులను అందిస్తుంది. అయితే అదే సమయంలో, మార్కెట్ పతనంలో ఇది ప్రమాదకర ఉచ్చు కావచ్చు. సరైన అవగాహన, క్రమశిక్షణ, జాగ్రత్తతో ఉపయోగిస్తే LAS విలువైన ప్రయోజనాలను అందిస్తుంది; అలోచన లేకుండా చేస్తే పెట్టుబడి, క్రెడిట్ స్కోర్ రెండూ ప్రమాదంలో పడతాయని నిపుణులు చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+