Saral Pension Scheme: ప్రతి ఒక్కరూ మెరుగైన జీవితాన్ని కోరుకుంటారు. భవిష్యత్తు సాఫీగా సాగిపోవాలని కోరుకుంటుంటారు. మీరు కూడా రానున్న రోజుల్లో సంతోషంగా ఉండాలని భావిస్తున్నట్లయితే మీకు ఎల్ఐసీ ఒక మంచి పాలసీని అందుబాటులో ఉంచుతోంది. ఈ ప్లాన్ కింద పాలసీదారుడు పాలసీ తీసుకునేటప్పుడు ఒక్కసారి ప్రీమియం చెల్లించాలి. అంటే.. ఒక్కసారి చెల్లించిన ప్రీమియం ద్వారా అతను జీవితాంతం పెన్షన్ పొందుతారు.

పాలసీ ప్రయోజనాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఎల్ఐసీకి చెందిన సరళ్ పెన్షన్ స్కీమ్ గురించే. ఈ పాలసీని రెండు విధాలుగా తీసుకోవచ్చు. మొదటగా సింగిల్ లైఫ్ పాలసీ, రెండవది జాయింట్ లైఫ్ పాలసీ. సింగిల్ లైఫ్ పాలసీలో పాలసీదారు ఉన్నప్పుడే పెన్షన్ అందుకోవడం కొనసాగుతుంది. పెన్షన్ హోల్డర్ మరణించిన తర్వాత, బేస్ ప్రీమియం మొత్తం నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది. అదే జాయింట్ లైఫ్ పాలసీలో ఎవరు ఎక్కువకాలం జీవించి ఉంటారో వారికి పెన్షన్ అందుతూనే ఉంటుంది. పెన్షన్ చెల్లింపులో ఎలాంటి కోత ఉండదు. ఇద్దరూ మరణిస్తే.. నామినీకి ప్రీమియం చెల్లిస్తారు.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
సరల్ పెన్షన్ యోజన పాలసీ కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇన్సూరెన్స్ సైట్ లో హోమ్ పేజీకి వెళ్లి సరళ్ పెన్షన్ యోజన ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తరువాత దరఖాస్తు ఫారమ్ లో మీ పేరు, వయస్సు, మొబైల్ నంబర్ మొదలైన అన్ని అవసరమైన సమాచారాన్ని అందించాలి. ఆ తరువాత అక్కడ అడిగిన అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను జోడించి సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు..
ముందుగా మీరు సమీపంలోని ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన కార్యాలయానికి వెళ్లాలి. అక్కడి సిబ్బందిని సరళ్ పెన్షన్ యోజన స్కీమ్ దరఖాస్తు ఫరమ్ అడిగి పొందవచ్చు. పూర్తి వివరాలు ఫిల్ చేసిన తరువాత కార్యాలయంలో సమర్పించాలి.

అవసరమైన పత్రాలు-
* ఆధార్ కార్డ్
* బ్యాంక్ అకౌంట్
* రేషన్ కార్డ్
* రెసిడెన్స్ సర్టిఫికెట్
* ఇన్కమ్ సర్టిఫికెట్
* పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్
* మొబైల్ నంబర్

ఎంత పెట్టుబడి పెట్టాలి..
LIC కాలిక్యులేటర్ ప్రకారం మీ వయస్సు 42 ఏళ్లనుకుంటే.. మీరు రూ.30 లక్షల యాన్యుటీని కొనుగోలు చేసినట్లయితే మీకు ప్రతి నెలా రూ.12,388 పెన్షన్ వస్తుంది. యాన్యుటీపై ఎలాంటి గరిష్థ పరిమితి లేదు. 40 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పథకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్ కింద కనీస వార్షికాదాయం సంవత్సరానికి రూ.12,000గా ఉంది. ఈ ప్లాన్ కింద మీరు నెలవారీ పెన్షన్ ప్రయోజనం పొందాలనుకుంటే, ప్రతి నెలా కనీసం వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications