lic: బీమా అనగానే మొదట గుర్తొచ్చే పేరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC). వివిధ స్కీంలతో ఎప్పుడూ వినియోగదారులకు మంచి సేవలు అందించేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా.. వాట్సాప్ ద్వారా ఇంటరాక్టివ్ సేవలను కొత్తగా ప్రారంభించింది. తద్వారా ఏజెంట్ల వద్దకు, వెబ్ సైట్ కి వెళ్లకుండానే ప్రాథమిక సౌకర్యాలను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చన్నమాట.

ప్రాథమిక సేవలన్నీ వాట్సాప్ లో:
వినియోగదారుల కోసం వాట్సాప్ లో 24 X 7 ఇంటరాక్టివ్ సేవలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ప్రారంభించింది. 'LIC WhatsApp' చాట్ బాట్ ద్వారా ప్లాన్‌లకు సంబంధించిన సమాచారం, ఇతర సేవలను త్వరగా యాక్సెస్ చేయడానికి పాలసీదారులకు అవకాశం ఏర్పడింది. లోన్ అర్హత, రీపేమెంట్ కోట్ లు, పాలసీ స్థితి, బోనస్, స్టేట్ మెంట్, ప్రీమియం గడువు తేదీల అప్‌డేట్‌లు, లోన్ వడ్డీ గడువు తేదీ నోటిఫికేషన్‌లు, చెల్లించిన ప్రీమియంల సర్టిఫికెట్‌లు, సర్వీసుల ఎంపిక/నిలిపివేత వంటి పలు సేవలను నేరుగా WhatsApp ద్వారా పొందవచ్చు.

హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు:
'LIC WhatsApp' సేవలను వినియోగించుకునేందుకు '+91 8976862090' నంబరుకు 'హాయ్' అని వాట్సాప్ లో మెసేజ్ చేయాలి. అనంతరం 11 రకాల సేవలకు సంబంధించిన ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. కావాల్సిన సేవతో కూడని నంబరుతో రిప్లై ఇస్తే సరి. మీ అవసరానికి సంబంధించిన వివరాలను LIC షేర్ చేస్తుంది. అయితే వాట్సాప్ ద్వారా సేవలను పొందేందుకు, పాలసీదారులు ముందుగా అధికారిక సైట్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

నమోదు ఇలా..
మొదటిసారి రిజిస్ట్రేషన్ కోసం.. LIC అధికారిక వెబ్ సైట్(www.licindia.in) లోని కస్టమర్ పోర్టల్ లో ఉన్న 'కొత్త వినియోగదారు' ఆప్షన్ ని ఎంచుకోవాలి. యూజర్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యి బేసిక్ సర్వీసెస్ లోని యాడ్ పాలసీపై క్లిక్ చేయాలి. కస్టమర్ కు కావాల్సిన పాలసీలన్నిటినీ అక్కడ నమోదు చేయాలి. ఈ విధంగా LICలో బీమా పాలసీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వాట్సాప్ సర్వీసును వినియోగించుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications