పీఎఫ్ ఖాతాదారులకు ఆ సంస్థ అధిక పెన్షన్ కోసం అవకాశం కల్పించింది. అధిక పెన్షన్ కోసం ఇప్పటి వరకు 8,897 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తెలిపింది. EPFO ఫిబ్రవరి 27 నుంచి EPS-95 పథకం కింద అధిక జీతంపై పెన్షన్ కంట్రిబ్యూషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు అవకాశం కల్పించారు.

91,258 మంది
అటు రిటైర్డ్ ఈపీఎస్ సభ్యుల నుంచి 91,258 ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చాయి. వీరు సెప్టెంబర్ 1, 2014 కంటే ముందు అధిక పెన్షన్ కోసం పరిగణించని రిటైర్డ్ ఉద్యోగులు. వారు దరఖాస్తు చేసుకునే అవకాశం మార్చి 4తో ముగుస్తుంది.

అధిక పెన్షన్ పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
1. https://unifiedportal-mem.epfindia.gov.in/memberInterfacePohw/memberకి వెళ్లాలి.
2.ఇక్కడ మీకు పెన్షన్ ఆన్ హయ్యర్ శాలరీ ట్యాబ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
3.ఇప్పుడు మీకు జాయింట్ అప్లికేషన్ ఫారమ్ అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది.
4. దీని తర్వాత అడిగిన మొత్తం సమాచారాన్ని పూరించాలి. OTP బటన్‌పై క్లిక్ చేయాలి.
5. ఇప్పుడు మీ ఫోన్‌లో ఆధార్‌తో లింక్ చేసిన నంబర్‌పై OTP వస్తుంది. దాన్ని నమోదు చేసి సడ్మిట్ చేయాలి

ఎంత వస్తుందంటే..
ఒక వ్యక్తి 25 సంవత్సరల వయస్సులో ఉద్యోగంలో చేరి 58 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తే అతను 33 సంవత్సరాలు పని చేసినట్లు లెక్క.. మీ జీతం రూ. 40,000 అనుకంటే.. సాధారణ పెన్షన్ పథకం కింద వారి జీతంలో సంవత్సరానికి రూ.15 వేలు కట్ అవుతాయి. ఆ వ్యక్తికి ప్రతి నెలా పెన్షన్‌గా రూ. 7071 [(రూ. 15000×33)/70] పొందుతాడు. అధిక పెన్షన్ ఎంచుకుంటే జీతంలో సంవత్సరానికి రూ.40 వేలు కట్ అవుతాయి. ఆ వ్యక్తికికి పెన్షన్‌గా రూ. 18,857 [(రూ. 40000×33)/70] పొందుతారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications