EPFO: ఉద్యోగం మానేస్తే పీఎఫ్ డబ్బులు మొత్తం వస్తాయా.. ఎన్ని రోజులకు పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు..!
ఉద్యోగం చేస్తున్న దాదాపు అందరికీ పీఎఫ్ ఖాతా ఉంటుంది. అయితే కొంత మంది మధ్యలోనే జాబ్ మానేస్తారు. దీంతో వారి పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బును తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఉద్యోగం మానేసిన తర్వాత వెంటనే పీఎఫ్ డబ్బులు తీసుకోలేమని పీఎఫ్ నిబంధనలు చెబుతున్నాయి. ఒక ఉద్యోగి ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత క్లయిమ్ చేసుకోవచ్చు. గతంలో ఇది 12 నెలలు ఉండేది. గతంలో ఉద్యోగం మానేసిన 12 నెలల తర్వాత పీఎఫ్ క్లయిమ్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని రెండు నెలలకు తగ్గించారు. పీఎఫ్ ఖాతాలో రెండు నెలలు చందా జమ కాకుంటే అప్పుడు పీఎఫ్ సొమ్మును తీసుకోవచ్చు.
అయితే ఉద్యోగి 10 ఏళ్ల సర్వీస్ లోపు ఉద్యోగం మానేస్తే పీఎఫ్, పెన్షన్ మొత్తం తీసుకోవచ్చు. ఉద్యోగి 10 సంవత్సరాల పైగా సర్వీస్ తర్వాత ఉద్యోగం మానేస్తే కేవలం పీఎఫ్ డబ్బు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత రెండు నెలలు ఆగాలి ఆ తర్వాత పీఎఫ్ డబ్బులు క్లయిమ్ చేసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. ఒక వేళ జాబ్ మానేసిన తర్వాత క్లెయిమ్ చేయకుండా ఉంటే ఏం జరుగుతుందో అని చాలా మందికి డౌట్ ఉంది. ఈపీఎఫ్ఓ పథకం 1952లోని పేరాగ్రాఫ్ 72(6) ప్రకారం, ప్రతి ఒక్కరికీ మూడేళ్ల నిబంధన ఉంటుంది.

ఉద్యోగి 55 ఏళ్లలోపు ఉద్యోగాన్ని వదిలేస్తే, పాత PF ఖాతాలో కొత్తగా డబ్బులు జమ కాకపోయినా 58 ఏళ్ల వయసు వచ్చే వరకు వడ్డీ జమ అవుతుంది. అదే 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసులో ఉద్యోగం నుంచి రిటైర్ అయితే, చివరిసారిగా PFలో డబ్బులు జమ అయిన తర్వాత 36 నెలల వరకు వడ్డీ లభిస్తుంది. పీఎఫ్ డబ్బుపై మూడేళ్ల వరకు వడ్డీ వస్తుంది. ఆ తర్వాత ఖాత ఇన్ యాక్టివ్ అవుతుంది. PF ఖాతాదారుడు మరణించిన తర్వాత 36 నెలల్లోగా నామినీ లేదా చట్టబద్ధ వారసులు డబ్బుల కోసం క్లెయిమ్ చేయకపోతే ఖాతా ఇన్ఆపరేటివ్గా మారుతుంది.
పీఎఫ్ ఖాతాలో డబ్బులు విత్ డ్రా చేయాలంటే.. ఉద్యోగి ఎగ్జిట్ తేదీ ఉండాలి. ఉగ్యోగికి సంబంధంచి పాన్ కార్డు నంబర్, బ్యాంకు ఖాతా, నామినీ అన్ని ఉండాలి. అప్పుడు మాత్రమే క్లయిమ్ యాక్సెప్ట్ అవుతుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications