Aadhaar Card: వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్ లోడ్ చేసుకోండిలా..!
ఆధార్.. దేశంలో ప్రతి ఒక్కరికి దీని అవసరం ఉంటుంది. మనం బ్యాంక్ అకౌంట్ తీయాలన్నా.. ఏ పని చేయాలన్నా ఇప్పుడు ఆధార్ అడుగుతున్నారు. అయితే కొన్నిసార్లు ఆధార్ మర్చిపోవడం చేస్తుంటారు. అప్పుడు మీకు ఆధార్ కావాలంటే.. సాధ్యం కాదు. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం వాట్సాప్ ద్వారానే నేరుగా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే అద్భుతమైన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎలాంటి యాప్‌లు ఓపెన్ చేయకుండా, సింపుల్‌గా వాట్సాప్‌లోనే మీ ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీరు ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాలంటే.. తప్పనిసరిగా ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ తో లింక్ అయి ఉండాలి.
మీ పేరు మీద 'డిజిలాకర్' అకౌంట్ ఉండాలి లేకపోతే యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఇప్పుడే డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ప్రభుత్వ అధికారిక 'MyGov Helpdesk' వాట్సాప్ నంబర్ +91-9013151515 ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. మీ వాట్సాప్ ఓపెన్ చేసి, ఆ కాంటాక్ట్ నంబరుతో చాట్ విండో తెరవాలి. చాట్‌లో 'Hi' లేదా 'Namaste' అని టైప్ చేసి మెసేజ్ పంపాలి. అక్కడి నుంచి వచ్చే రిప్లైలలో 'DigiLocker Services' ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. మీకు డిజిలాకర్ అకౌంట్ ఉందా అని బాట్ అడుగుతుంది. 'Yes' అని రిప్లయ్ ఇవ్వాలి. లేకపోతే ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఒక OTP (వన్-టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. ఆ OTPని వాట్సాప్ చాట్‌లో టైప్ చేసి పంపాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, మీ డిజిలాకర్ అకౌంట్లో ఉన్న డాక్యుమెంట్ల లిస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అందులో ఆధార్‌కు సంబంధించిన నంబర్‌ను టైప్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి.
అంతే! మీ ఆధార్ కార్డు పీడీఎఫ్ ఫార్మాట్‌లో నేరుగా మీ వాట్సాప్ చాట్‌కే వచ్చేస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. మీరు డిజిటల్ లాకర్ లో కూడా ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ఆధార్ డౌన్ లోడ్ కాకుండా చాలా పత్రాల డౌన్ లోడ్ అకాశం కల్పించారు. ఏపీలో వాట్సాప్ ద్వారా ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడుతున్న నేపథ్యంలో వాట్సాప్ పలు రకాల సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications