Fixed deposits: గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు..!
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. సీనియర్ సిటిజన్లకు ఎక్కువ ప్రయోజనాన్ని కలిగించనుంది. బంధన్ బ్యాంక్ కొన్ని నిర్దిష్ట కాలపరిమితి గల FDలపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచినట్లు ప్రకటించింది. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు లభించే గరిష్ట వడ్డీ రేటు 7.95 శాతానికి పెంచింది. మిగతావారికి ఇదే కాలపరిమితితో 7.45 శాతం వరకు వడ్డీ చెల్లిస్తామని వివరించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన సంగతి తెలసిందే. అయినప్పటికీ కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. బంధన్ బ్యాంక్ ఐదేళ్లలోపు కాలపరిమితి గల స్థిర డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని అందిస్తున్నట్లు తెలిపింది.

కాల వ్యవధి, వడ్డీ రేట్లు
7 నుంచి 14 రోజుల గల డిపాజిట్లకు 2.95 శాతం వడ్డీ ఉండగా.. సీనియర్ సిటిజన్లకు 3.70 శాతంగా ఉంది.
15 నుంచి 30 రోజుల డిపాజిట్లకు 2.95 శాతం ఉండగా సీనియర్ సిటిజన్లకు 3.70 శాతంగా ఉంది.
31 రోజులు నుంచి 2 నెలల కంటే తక్కువ డిపాజిట్లకు 3.45 శాతం ఉండగా సీనియర్ సిటిజన్లకు 4.20 శాతంగా ఉంది.
2 3 నెలల కంటే తక్కువ డిపాజిట్లకు 4.20 శాతం ఉండగా సీనియర్ సిటిజన్లకు 4.95 గా ఉంది.
3 నెలలు - 6 నెలల కంటే తక్కువ డిపాజిట్లకు 4.20 శాతం ఉండగా సీనియర్ సిటిజన్లకు 4.95 గా ఉంది.
6 నెలలు - 1 సంవత్సరం కంటే తక్కువ 4.20 శాతం ఉండగా సీనియర్ సిటిజన్లకు 4.95గా ఉంది.
1 సంవత్సరం డిపాజిట్లకు 7.00 శాతం ఉండగా సీనియర్ సిటిజన్లకు7.50గా ఉంది.
1 సంవత్సరం 1 రోజు - 1 సంవత్సరం 9 నెలలు జిపాజిట్లకు 7.00 శాతం ఉండగా సీనియర్ సిటిజన్లకు7.50గా ఉంది.
1 సంవత్సరం 9 నెలల 1 రోజు - 2 సంవత్సరాల కంటే తక్కువ 7.00శాతం ఉండగా సీనియర్ సిటిజన్లకు7.50గా ఉంది.
2 సంవత్సరాలు - 3 సంవత్సరాల కంటే తక్కువ డిపాజిట్లకు 7.45 శాతం ఉండగా సీనియర్ సిటిజన్లకు 7.95గా ఉంది.
3 సంవత్సరాలు - 5 సంవత్సరాల కంటే తక్కువ డిపాజిట్లకు 7.25 శాతం ఉండగా సీనియర్ సిటిజన్లకు 7.75గా ఉంది.
5 సంవత్సరాలు - 10 సంవత్సరాల డిపాజిట్లకు 5.85 శాతం ఉండగా సీనియర్ సిటిజన్లకు 6.60గా ఉంది.
సవరించిన ఈ వడ్డీ రేట్లు బ్యాంకింగ్ రంగంలో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని బంధన్ బ్యాంక్ పేర్కొంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లే కాకుండా రూ.5 లక్షల పైన,రూ.10 లక్షల వరకు ఉన్న సేవింగ్స్ ఖాతా నిల్వలపై బ్యాంక్ 6.5% వడ్డీ రేటును అందిస్తుంది. పెరిగిన వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందడానికి రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా అధికారిక ఎంబంధన్ (mBandhan) మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని బ్యాంకు తెలిపింది. సవరించిన వడ్డీ రేట్లు జూన్ 20 నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications